రిలయన్స్ రీస్టార్ట్… క‌ృష్ణ-గోదావరి బేసిన్ నుంచి గ్యాస్ ఉత్పత్తి… ప్రకటించిన ఆర్ఐఎల్…

ఆంధ్రప్రదేశ్‌ తీరంలోని కృష్ణ-గోదావరి (కేజీ) బేసిన్‌ నుంచి తిరిగి గ్యాస్‌ ఉత్పత్తిని ప్రారంభించినట్లు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) ప్రకటించింది.

రిలయన్స్ రీస్టార్ట్... క‌ృష్ణ-గోదావరి బేసిన్ నుంచి గ్యాస్ ఉత్పత్తి... ప్రకటించిన ఆర్ఐఎల్...
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Dec 20, 2020 | 10:56 AM

ఆంధ్రప్రదేశ్‌ తీరంలోని కృష్ణ-గోదావరి (కేజీ) బేసిన్‌ నుంచి తిరిగి గ్యాస్‌ ఉత్పత్తిని ప్రారంభించినట్లు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) ప్రకటించింది. కేజీ-డీ6 క్షేత్రంలోని ఆర్‌-క్లస్టర్‌ నుంచి కొత్తగా గ్యాస్‌ ఉత్పత్తిని ప్రారంభించింది. వచ్చే ఏడాదికల్లా ఈ క్లస్టర్‌ నుంచి రోజుకు 1.29 కోట్ల ప్రామాణిక ఘనపు మీటర్ల గ్యాస్‌‌ను వెలికితీయనన్నారు. బ్రిటిష్‌ పెట్రోలియం (బీపీ)తో కలిసి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఈ బ్లాకులో మరో రెండు గ్యాస్‌ క్లస్టర్లను అభివృద్ధి చేస్తోంది.

ఈ మూడు క్లస్టర్లు కాకినాడ తీరం నుంచి 60 కిలోమీటర్ల దూరంలో లోతట్టు సముద్ర జలాల్లో ఉన్నాయి. 2022 నాటికి మిగతా రెండు క్లస్టర్ల నుంచి సహజ వాయువు ఉత్పత్తి ప్రారంభం కానుంది. ఈ మూడు క్లస్టర్ల నుంచి పూర్తి స్థాయిలో గ్యాస్‌ ఉత్పత్తి ప్రారంభమైతే దేశీయ గ్యాస్‌ అవసరాల్లో 25 శాతం తీరుతుందని అంచనా. సముద్ర ఉపరితలం నుంచి దాదాపు 2,000 మీటర్ల లోతున ఉన్న ఈ బావుల నుంచి రిలయన్స్‌-బీపీ కంపెనీలు గ్యాస్‌ వెలికితీయబోతున్నాయి. ఆసియాలో ప్రస్తుతం మరే ప్రాంతంలోనూ సముద్ర జలాల్లో ఇంత లోతు నుంచి సహజ వాయువును వెలికి తీయడం లేదు.

ఈ ఒక్కపని చేస్తే చాలు.. గుండెపోటు వచ్చే అవకాశం 40 శాతం తగ్గుతుంది
ఈ ఒక్కపని చేస్తే చాలు.. గుండెపోటు వచ్చే అవకాశం 40 శాతం తగ్గుతుంది
పరేషాన్ చేయకే మల్లన్న.. కొంపముంచిన ఈటలతో సరదా..
పరేషాన్ చేయకే మల్లన్న.. కొంపముంచిన ఈటలతో సరదా..
ఆ నిర్మాత వేధించాడు, బెదిరించాడు.. షాకింగ్ విషయం చెప్పిన నటి
ఆ నిర్మాత వేధించాడు, బెదిరించాడు.. షాకింగ్ విషయం చెప్పిన నటి
ఆరెంజ్, పర్పుల్ క్యాప్ రేసులో భారత ఆటగాళ్లదే ఆధిపత్యం..
ఆరెంజ్, పర్పుల్ క్యాప్ రేసులో భారత ఆటగాళ్లదే ఆధిపత్యం..
ఇంటి అద్దె భత్యాన్ని క్లెయిమ్ చేస్తే ఈ తప్పు చేయకండి
ఇంటి అద్దె భత్యాన్ని క్లెయిమ్ చేస్తే ఈ తప్పు చేయకండి
'అసలు సోనియా, ఇందిరాలకు మంగళసూత్రాలు ఉన్నాయో.. లేవో..' మంత్రి
'అసలు సోనియా, ఇందిరాలకు మంగళసూత్రాలు ఉన్నాయో.. లేవో..' మంత్రి
ఎండకు దూరంగా ఉంటున్నారా.? క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఉంటుంది..
ఎండకు దూరంగా ఉంటున్నారా.? క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఉంటుంది..
ముగిసిన నామినేషన్ల పర్వం.. బరిలో ఉన్నదీ ఎవరంటే..?
ముగిసిన నామినేషన్ల పర్వం.. బరిలో ఉన్నదీ ఎవరంటే..?
పోస్టాఫీసు-ఎల్‌ఐసీ స్కీమ్స్‌.. ఇందులో ఏ ప్లాన్స్‌ మంచివి!
పోస్టాఫీసు-ఎల్‌ఐసీ స్కీమ్స్‌.. ఇందులో ఏ ప్లాన్స్‌ మంచివి!
ప్లే ఆఫ్ చేరాలంటే గెలవాల్సిందే.. గుజరాత్, బెంగళూరు కీలకపోరు
ప్లే ఆఫ్ చేరాలంటే గెలవాల్సిందే.. గుజరాత్, బెంగళూరు కీలకపోరు