AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆమెకు 25 ఏళ్లు.. ఆయనకు 45 ఏళ్లు.. నాడు వైరల్‌గా మారిన వివాహం.. నేడు విషాదం

వివాహం చేసుకోవడం అనేది సర్వసాధారణం. పెళ్లీడు వచ్చిందంటే తప్పకుండా వివాహం చేసుకోవాల్సిందే. కానీ కొన్ని వివాహాలు భిన్నంగా ఉంటాయి. అలాంటి వివాహాలు సోషల్‌..

ఆమెకు 25 ఏళ్లు.. ఆయనకు 45 ఏళ్లు.. నాడు వైరల్‌గా మారిన వివాహం.. నేడు విషాదం
Subhash Goud
|

Updated on: Mar 30, 2022 | 11:56 AM

Share

వివాహం చేసుకోవడం అనేది సర్వసాధారణం. పెళ్లీడు వచ్చిందంటే తప్పకుండా వివాహం చేసుకోవాల్సిందే. కానీ కొన్ని వివాహాలు భిన్నంగా ఉంటాయి. అలాంటి వివాహాలు సోషల్‌ మీడియా వేదికగా తెగ వైరల్‌ అవుతుంటాయి. తాజాగా ఓ వివాహం నెటిజన్లను ఆకట్టుకుంది. అందులో ఒకటి 45 వెడ్స్‌ 25 పెళ్లి స్టోరీ. ఈ కథనం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తాజాగా ఓ వరుడు ఆత్మహత్య చేసుకోవడం విషాదాంతమైంది. ఈ ఘటన కర్ణాటక (Karnataka)లోని తుమకూరు జిల్లా అక్కిమరిద్య గ్రామంలో చోటు చేసుకుంది. కర్ణాటకకు చెందిన శంకరన్న (Shankaranna)కు 45 ఏళ్లు. అయినా పెళ్లి కాలేదు. ఎన్ని పెళ్లి సంబంధాలు వచ్చినా కుదరలేదు. ఇంతలో అప్పటికే వివాహమై భర్త నుంచి విడిపోయిన 25ఏళ్ల మేఘన (Meghana )ను శంకరప్ప కలిశాడు. ఆమెను అతన్ని ప్రేమించి 2021 అక్టోబర్‌లో కుణిల్‌ తాలుకాలోని హులియూర్‌లోని ఓ ఆలయంలో వివాహం చేసుకుంది. అయితే ఈ వివాహం అప్పట్లో వైరల్‌ అయ్యింది.

పెళ్లయిన తర్వాత మేఘన శంకరన్నకు చెందిన 2.5 కోట్ల భూమిని అమ్మాలని ఒత్తిడి తీసుకువచ్చింది. దీనికి శంకరన్న అమ్మ అంగీకరించలేదు. దీంతో తరచూ వారి మధ్య గొడవలు జరిగేవి. గొవల కారణంగా తీవ్ర మనస్థాపానికి గురైన శంకరన్న ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే శంకరన్న పెరట్లోని చెట్టుకు ఉరివేసుకుని వేలాడుతుండగా, స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అయితే గత కొన్ని రోజులుగా మేఘన, శంకరన్నల మధ్య గొవలు జరుగుతున్నాయని, దీని కారణంగా ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని స్థానికులు పోలీసులకు తెలిపారు. అయితే మేఘనకు మూడేళ్ల కిందటనే వివాహమైందని తెలుస్తోంది. పెళ్లాయిన ఏడాదికే భర్త ఇంటి నుంచి పారిపోవడంతో రెండేళ్లుగా ఒంటరిగా ఉన్న మేఘన ఆరునెలల క్రితం శంకరన్నను వివాహం చేసుకుంది.

ఇవి కూడా చదవండి:

Hyderabad: హైదరాబాద్‌ పోలీసులకు చుక్కలు చూపించిన మందుబాబులు.. మూడు గంటల పాటు నడిరోడ్డుపై రభస

Crime News: బెంగాల్‌లో మరో నిర్భయ.. సెల్‌ఫోన్ కోసం చెల్లిని మృగానికి అప్పగించిన అక్క..