Scorpion Poison: ఏడాదికి ఓ సారి తిన్న జీవించే ఈ జీవి .. లీటర్ విషం ఖరీదు కొన్ని కోట్లు.. ఆ విషపు జంతువు ఎవరో తెలుసా..!

Scorpion:  మనం సర్వ సాధారణంగా గోడమీద బొమ్మ ... గొలుసుల బొమ్మ... వచ్చే పోయే వారిని... వడ్డించే బొమ్మ వంటి సామెతలను.. తేలు కుట్టిన దొంగ వంటి ఉపమానాలు..

Scorpion Poison: ఏడాదికి ఓ సారి తిన్న జీవించే ఈ జీవి .. లీటర్ విషం ఖరీదు కొన్ని కోట్లు.. ఆ విషపు జంతువు  ఎవరో తెలుసా..!
Scorpians
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jun 16, 2021 | 9:01 PM

Scorpion Poison:  మనం సర్వ సాధారణంగా గోడమీద బొమ్మ … గొలుసుల బొమ్మ… వచ్చే పోయే వారిని… వడ్డించే బొమ్మ వంటి సామెతలను.. తేలు కుట్టిన దొంగ వంటి ఉపమానాలు వింటూనే ఉన్నాం. విషపు జంతువుల్లో ఒకటి తేలు. ఇవి సుమారు 2000 జాతులున్నాయి. ఇవి కుడితే సర్వ సాధారణంగా ప్రాణం పోదు కానీ.. విపరీతమైన బాధను పడాల్సి ఉంటుంది.

తేలు ఓ విచిత్ర జంతువు ఆకారంలోనే కాదు.. అది జీవన విధానంలో కూడా చిత్రాతి విచిత్రాలున్నాయట. ఇక ఈ తేలు కరిస్తే.. అల్లోపతి కంటే హోమియో పతి, ఆయుర్వేద మందులు బాగా ఉపయోగపడతాయని. విషాన్ని హరిస్తాయని అంటారు.

తేలు కుడితే ఆయుర్వేద చికిత్స ద్వారా మంట నొప్పి తగ్గించవచ్చు. ఉత్తరేణి ఆకుల్ని దంచి రసం తీసి మిశ్రమం తో పాటు కుట్టినచోట రుద్దితే పైకి ఎక్కిన విషం కిందకు దిగి వస్తుంది. ఎర్ర ఉల్లిగడ్డ ను రెండు ముక్కలుగా కోసి కుట్టినచోట రుద్దితే ఐదు నిమిషాల్లో 90% మంట తగ్గుతుంది. కొందరికి మాత్రమే తేలు కుట్టినచోట మంట నొప్పి ఉంటుంది మరి కొందరికి నొప్పి పైకి వచ్చి కాలు లేదా చేతికి మొత్తంగా నొప్పి వస్తుంది. దీనికి ముందు ఆయుర్వేద చికిత్స తరువాత పైన చెప్పిన హోమియో చికిత్స సరిపోతుంది.

ఈ తేళ్లు ఏడాదికి ఒక్క పురుగు దొరికినా చాలు దాన్ని తిని బతికేస్తాయి. ఎలాంటి వాతవరణంలోనైనా జీవిస్తాయి. ఒక్కోసారి తిండి దొరక్కపోతే జీర్ణప్రక్రియ వేగాన్ని తగ్గించుకుంటాయి. అప్పుడు దీనికి ఏడాదికి ఓసారి తింటే చాలు అనుకుంటాయట. శాస్త్రవేత్తలు వీటిని మంచులో గడ్డకట్టించి పరీక్షించారు. మర్నాడు ఎండా తగలగానే నడవడం చూసి ఆశ్చర్యపోయారు. నెలలో బొరియలు చేసుకుని రాళ్ళక్రింద కూడా జీవిస్తాయి తేళ్లు. అయితే ఈ తేళ్లు విషం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన విషం.

మనిషి కుట్టి భరించరాని బాధను కలిగించే ఈ తేళ్లు విషంతో మందులు తయారు చేస్తారు. శరీరానికి వచ్చే కొన్ని రకాల వ్యాధుల్ని తరిమికొట్టే శక్తి తేలు విషానికి ఉంది. అందుకనే తేలు విషానికి అత్యంత డిమాండ్ ఏర్పడింది. ప్రస్తుతం ఒక గ్రాము తేలు విషం రూ. 7.30 లక్షలు. అంటే లీటర్ తేలు విషం రూ. 73 కోట్లు. అందుకే ప్రపంచంలో అత్యంత ఖరీదైన విషంగా ఇది గుర్తింపు పొందింది. తేలు విషంతో కీళ్లవాతాన్ని తగ్గించవచ్చని అమెరికాలోని బేలార్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ నిర్వహించిన పరిశోధనల్లో తెలిసింది. తేలు విషంలో కాంపొనెంట్స్ ఉంటాయి. వాటి ద్వారా కీళ్ల నొప్పుల్ని సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మరీ తగ్గించవచ్చని పరిశోధకులు తేల్చారు.  అంతేకాదు ఇప్పటికే తేలు విషంతో తయారైన మందును మొత్తం 13 లక్షల మందిపై ప్రయోగించారు. వారిలో ముసలితనంలో వచ్చే కీళ్లవాతం(రుమటాయిడ్ ఆర్థరైటిస్), కీళ్ల నొప్పుల వంటివి తగ్గిపోయాయి.

Also Read: మీ పెదవులు నల్లగా ఉన్నాయా.. చర్మం కాంతివంతం కావాలా ఐతే కొత్తిమీరతో ఇలా చేస్తే సరి