పదో తరగతి విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. పరీక్షలపై కీలక నిర్ణయం.!
కరోనా నేపథ్యంలో ఈ ఏడాది విద్యా సంవత్సరం(2020-21) ఆలస్యంగా ప్రారంభమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యార్థులపై ఒత్తిడి పడకుండా ఉండేందుకు
Schools Re-Open In Telangana: కరోనా నేపథ్యంలో ఈ ఏడాది విద్యా సంవత్సరం(2020-21) ఆలస్యంగా ప్రారంభమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యార్థులపై ఒత్తిడి పడకుండా ఉండేందుకు తెలంగాణ విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా టెన్త్ ప్రశ్నాపత్రాల్లో ఛాయిస్‌లను పెంచాలని నిర్ణయించింది. పదో తరగతిలో ఒక్కో పేపర్‌కు 40 మార్కులతో పరీక్షను నిర్వహిస్తారు. అందులో కొన్ని సెక్షన్లలో ఏ లేదా బీ ప్రశ్నలు ఉంటే.. పార్ట్-బీలో అబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్లు ఉంటాయి. ఈ అబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలను పెంచాలని నిర్ణయించారు.
అయితే ఇదే సమయంలో ఇంటర్ క్వశ్చన్ పేపర్ విధానాన్ని మార్చకూడదని విద్యాశాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇంటర్ ప్రశ్నాపత్రంలో మార్పులు చేస్తే విద్యార్థులు జాతీయ పోటీ పరీక్షల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారని భావిస్తున్నారు. మరోవైపు డిసెంబర్ 1వ తేదీ నుంచి స్కూళ్లు, కాలేజీలు పున: ప్రారంభిస్తే.. సిలబస్ పూర్తి చేసేందుకు ఐదు నెలల సమయం పడుతుంది కాబట్టి.. ఇంటర్ పరీక్షలను ఏప్రిల్ చివరి వారంలో.. టెన్త్ ఎగ్జామ్స్‌ను మే నెలలో నిర్వహించనున్నారు. ఇక అన్ని మెయిన్ ఎంట్రన్స్ టెస్టులను మే నెలలోనే నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.