తెలంగాణలో బాణసంచాపై బ్యాన్ విధించిన ప్రభుత్వం.. ఉత్తర్వులు జారీ.. అమ్మకాలు చేస్తే చర్యలు..

తెలంగాణలో బాణసంచాపై బ్యాన్ విధించిన ప్రభుత్వం.. ఉత్తర్వులు జారీ.. అమ్మకాలు చేస్తే చర్యలు..

దీపావళి పండుగ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా టపాసులను బ్యాన్ చేయాలని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాల మేరకు ప్రభుత్వం బాణసంచాపై..

Ravi Kiran

|

Nov 13, 2020 | 1:53 PM

Diwali 2020: దీపావళి పండుగ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా టపాసులను బ్యాన్ చేయాలని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనితో తెలంగాణ ప్రభుత్వం బాణసంచాపై నిషేధం విధించింది. ఈ మేరకు శుక్రవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో బాణసంచా విక్రయాలు, కాల్చడంపై నిషేధం విధించామని.. తక్షణమే టపాసులు, క్రాకర్స్ దుకాణాలను మూసివేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశించారు. అంతేకాదు ఎవరైనా అమ్మకాలు జరిపితే కేసులు నమోదు చేయాలని డీజీపీ, కలెక్టర్లు, సీపీలు, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు.

కాగా, రాష్ట్రంలో కరోనా కేసులు ఉన్న నేపధ్యంలో టపాసులు పేల్చడం వల్ల ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉందని.. పండుగల కన్నా ప్రజల ప్రాణాలే తమకు ముఖ్యమని హైకోర్టు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఇప్పటికే టపాసులపై రాజస్థాన్ హైకోర్టు కూడా బ్యాన్ విధించిందని, కోలకత్తాలోనూ బ్యాన్ చేయకపోతే సుప్రీంకోర్టు బ్యాన్ చేయాలని ఆదేశాలు జారీ చేసిందని న్యాయస్థానం గుర్తు చేసింది. అటు ప్రచార మాధ్యమాల ద్వారా టపాసులు కాల్చకుండా ప్రభుత్వం ప్రజల్లో అవగాహన కల్పించాలని పేర్కొంది. ఇక దీనిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో ఈ నెల 19వ తేదీన తెలపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.

అలాగే దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. పొల్యూషన్ ద్వారా కరోనా వ్యాప్తి జరిగే అవకాశం ఉంటుందని.. ఈ దీపావళికి టపాసులు కాల్చకుండా ఉంటే మంచిదని వైద్యులు కూడా సలహా ఇస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తగిన చర్యలు తీసుకుంటున్నారు.

Also Read: 

పదో తరగతి విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. పరీక్షలపై కీలక నిర్ణయం.!

రైలు ప్రయాణీకులకు ముఖ్య గమనిక.. 12 రైళ్లు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే.. వివరాలివే..!

ఏపీ: సీఎం వైఎస్ జగన్ గుడ్ న్యూస్.. కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీస్ గడువు పొడిగింపు..

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu