Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హెడ్‌మాస్టార్ దారితప్పాడు..సర్టిఫికేట్ కోసం లంచం

పిల్లలకు విద్యాబుద్దులు నేర్పి, మంచిచెడ్డలు చెప్పాల్సిన మాస్టారే దారితప్పాడు. ఓ పూర్వ విద్యార్థి సర్టిఫికెట్ ఇవ్వాలని కోరగా లంచం డిమాండ్ చేశాడు.

హెడ్‌మాస్టార్ దారితప్పాడు..సర్టిఫికేట్ కోసం లంచం
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 23, 2020 | 4:07 PM

పిల్లలకు విద్యాబుద్దులు నేర్పి, మంచిచెడ్డలు చెప్పాల్సిన మాస్టారే దారితప్పాడు. ఓ పూర్వ విద్యార్థి సర్టిఫికెట్ ఇవ్వాలని కోరగా లంచం డిమాండ్ చేశాడు. ఆ మొత్తాన్ని తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో గురువారం చోటు చేసుకుంది. ఏసీబీ డీఎస్పీ ఎస్‌.వెంకటేశ్వరరావు చెప్పివ వివరాల ప్రకారం.. పెనుగొండకు చెందిన పూర్వ విద్యార్థి నూలి సూర్యప్రకాశ్‌ పదో తరగతి సర్టిఫికెట్‌ పోగొట్టుకున్నాడు. కొత్తదాని కోసం తాను చదువుకున్న పెనుగొండలోని జెడ్‌ఎన్‌వీఆర్‌ ఎయిడెడ్‌ ఉన్నత పాఠశాల హెడ్ మాస్టర్ జోశ్యుల శ్రీనివాస్‌కు దరఖాస్తు పెట్టుకున్నాడు. ఇందుకు ఆయన పది వేలు లంచం కావాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే ఇబ్బందులు తప్పవని కరాఖండీగా చెప్పేశాడు. దీంతో మాస్టారి తిక్క కుదర్చాలని బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో గురువారం స్టూడెంట్ సూర్యప్రకాశ్‌ నుంచి హెచ్‌ఎం పది వేల లంచం తీసుకుంటుండగా సీఐలు కె.శ్రీనివాస్‌, ఎం.రవీంద్ర  రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు డీఎస్పీ వివరించారు.

Also Read : కృష్ణా జిల్లాలో విషాదం, కరెంట్ షాక్‌తో ఇద్దరు కూలీలు మృతి

ఈడెన్ వివాదంపై నోరు విప్పిన హర్ష భోగ్లే! చిన్న కథ కాదురా సామీ!
ఈడెన్ వివాదంపై నోరు విప్పిన హర్ష భోగ్లే! చిన్న కథ కాదురా సామీ!
జమ్ముకశ్మీర్‌లో ఉగ్రదాడి.. టూరిస్టులపై కాల్పులు.. ఒకరు మృతి
జమ్ముకశ్మీర్‌లో ఉగ్రదాడి.. టూరిస్టులపై కాల్పులు.. ఒకరు మృతి
ఈ పండ్లు ఫ్రిడ్జ్‌లో పెడితే పోషకాలే విషమవుతాయి..
ఈ పండ్లు ఫ్రిడ్జ్‌లో పెడితే పోషకాలే విషమవుతాయి..
ఈ సీజన్ గంగార్పణం చేసిన ధోని!” చెన్నైపై రాయుడు షాకింగ్ కామెంట్స్
ఈ సీజన్ గంగార్పణం చేసిన ధోని!” చెన్నైపై రాయుడు షాకింగ్ కామెంట్స్
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
LICలో అద్భుతమైన పథకం.. రోజుకు రూ.50 జమ చేస్తే రూ.6 లక్షల బెనిఫిట్
LICలో అద్భుతమైన పథకం.. రోజుకు రూ.50 జమ చేస్తే రూ.6 లక్షల బెనిఫిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
ఖాళీ కడుపుతో వాకింగ్ మంచిదేనా..?
ఖాళీ కడుపుతో వాకింగ్ మంచిదేనా..?
రాత్రిపూట ఇలా తయారు చేసిన పాలు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?
రాత్రిపూట ఇలా తయారు చేసిన పాలు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?
ఏపీకి రెయిన్ అలర్ట్.. ఆ ప్రాంతాల్లో వచ్చే 3 రోజులు వర్షాలు..
ఏపీకి రెయిన్ అలర్ట్.. ఆ ప్రాంతాల్లో వచ్చే 3 రోజులు వర్షాలు..