అమెరికాలో 11 మంది భారతీయ విద్యార్థుల అరెస్ట్

అమెరికాలో అక్రమంగా నివాసముంటున్న 11 మంది భారతీయులతో సహా 15 మంది విదేశీ విద్యార్థులను ఆ దేశ పోలీసులు అరెస్ట్ చేశారు.

అమెరికాలో 11 మంది భారతీయ విద్యార్థుల అరెస్ట్
Follow us
Balaraju Goud

|

Updated on: Oct 23, 2020 | 3:25 PM

అమెరికాలో అక్రమంగా నివాసముంటున్న 11 మంది భారతీయులతో సహా 15 మంది విదేశీ విద్యార్థులను ఆ దేశ పోలీసులు అరెస్ట్ చేశారు. యూఎస్ ఇమిగ్రేషణ్ అధికారులు ఇచ్చిన సమాచారంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. అక్రమంగా దేశంలో నివసిస్తున్న కారణంగా వారిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. బోస్టన్‌‌, వాషింగ్టన్‌, హ్యూస్టన్‌, నెవార్క్‌, నాష్విల్లే, పిట్స్‌బర్గ్‌, హ్యారిస్‌బర్గ్‌ ప్రాంతాల నుంచి వీరిని అరెస్టు చేశారు. వీరంతా ‘ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌(ఓపీటీ)’ అనే వెసులుబాటుని ఉపయోగించుకొని అక్రమంగా అమెరికాలో నివసిస్తున్నట్లు ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు ఆరోపించారు. విద్యార్థుల చదవిన రంగంలో ఒక ఏడాది పాటు పనిచేసే అవకాశం ఓపీటీ కల్పిస్తుంది. స్టెమ్‌ ఓపీటీలో పాల్గొన్నట్లయితే మరో 24 నెలలు పనిచేయొచ్చు. కానీ, వీరంతా ఎక్కడా ఉద్యోగం చేయకుండానే ఓపీటీ అవకాశాన్ని వినియోగించుకుంటున్నట్లు అధికారులు ఆరోపించారు. గడువు ముగిసినప్పటికీ అక్రమంగా నివాసముంటున్నారు అధికారులు గుర్తించారు. మొత్తం 15 మంది విదేశీ విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు.