కరోనావైరస్.. సౌదీలో డేంజర్ బెల్స్..!

కోవిద్ 19 విజృంభణతో వాణిజ్య, ఉత్పాదక​ కార్యకలాపాలు స్తంభించాయి. సౌదీ అరేబియాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. సోమవారం ఒకే రోజు 51 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటిలో 25 మంది

  • Tv9 Telugu
  • Publish Date - 6:27 pm, Tue, 24 March 20
కరోనావైరస్.. సౌదీలో డేంజర్ బెల్స్..!

కోవిద్ 19 విజృంభణతో వాణిజ్య, ఉత్పాదక​ కార్యకలాపాలు స్తంభించాయి. సౌదీ అరేబియాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. సోమవారం ఒకే రోజు 51 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటిలో 25 మంది వేరే ప్రాంతాల నుంచి స్వస్థలాలకు వచ్చిన వారు ఉంటే, 26 మంది ఇంతకుముందు వైరస్ సోకిన వారి నుంచి వ్యాప్తి చెందినట్టు సౌదీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి డా. మహమ్మద్ అల్ అబ్ద్ అల్ అలీ తెలిపారు. ఈ 51 కొత్త కేసులతో కలిపి దేశవ్యాప్తంగా బాధితుల సంఖ్య 562కి చేరిందని ఆయన వెల్లడించారు. వీరిలో 26 మంది కోలుకున్నారని, ఇప్పటి వరకు ఎలాంటి మరణాలు సంభవించలేదన్నారు.