అమెరికాలో సీరియల్ కిల్లర్ మృతి, 19 రాష్ట్రాల్లో ఎంతమందిని హతమార్చాడంటే, నాలుగు దశాబ్దాల క్రిమినల్ హిస్టరీ

అమెరికాలో అత్యంత దారుణాలకు పాల్పడుతూ సుమారు 93 మంది అమాయకుల హత్యకు కారకుడైన సీరియల్ కిల్లర్ శామ్యూల్ లిటిల్ మరణించాడు.

అమెరికాలో సీరియల్ కిల్లర్  మృతి, 19 రాష్ట్రాల్లో ఎంతమందిని హతమార్చాడంటే, నాలుగు దశాబ్దాల క్రిమినల్ హిస్టరీ
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Dec 31, 2020 | 5:37 PM

అమెరికాలో అత్యంత దారుణాలకు పాల్పడుతూ సుమారు 93 మంది అమాయకుల హత్యకు కారకుడైన సీరియల్ కిల్లర్ శామ్యూల్ లిటిల్ మరణించాడు. 80 ఏళ్ళ ఇతడు బుధవారం ఆసుపత్రిలో మృతి చెంది ఉండగా కనుగొన్నారు. అమెరికాలోని 19 రాష్ట్రాల్లో ఈ కిల్లర్ నాలుగు దశాబ్దాల పాటు సాగించిన హత్యాకాండకు అంతే లేదు. ఇతని బారిన పడిన బాధితుల కుటుంబాల ఆచూకీ కోసం ఫెడరల్ పోలీసులు నేటికీ గాలిస్తూనే ఉన్నారు. ఎక్కువగా వేశ్యలను, డ్రగ్ యూజర్లను, పేదలను, నల్లజాతి మహిళలను లిటిల్ హత్య చేస్తూ వచ్చాడు. ఇతడిని ప్రాసిక్యూట్ చేయడానికి పోలీసులు నానా తంటాలు పడ్డారు. 2018 లో అతికష్టం మీద శామ్యూల్ లిటిల్ ని పోలీసులు పట్టుకుని కాలిఫోర్నియా జైలుకు తరలించారు.   తాను చేసిన నేరాల గురించి ఇతగాడు ఆ ఏడాది టెక్సాస్ లోని ఓ రేంజర్ కు వివరించాడట.

2014 లో మూడు హత్యలు చేసినా తాను ఏ నేరమూ చేయలేదని బుకాయించాడు. అంతకు ముందు లైంగిక నేరాలు, హత్యా యత్నాలు, హత్యల అభియోగాలను ఎదుర్కొన్నాడు. పోలీసులు  8 కేసులు పెట్టారు. అయితే ఎప్పటికప్పుడు వారి  నుంచి తప్పించుకుంటూ వచ్చాడు. ఇతని క్రిమినల్ హిస్టరీ తెలిసి పోలీసులు షాక్ తింటున్నారు. తమనే బురిడీ కొట్టించిన ఈ కరడు గట్టిన నేరగాని కథ ఇలా సమాప్తమైంది.

మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే!
మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే!
ఈ పంటకు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు.. సాగు చేసే విధానం ఏంటి?
ఈ పంటకు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు.. సాగు చేసే విధానం ఏంటి?
పర్సనల్ లోన్ ప్రయోజనాలు..అప్రయోజనాలు ఏమిటి?
పర్సనల్ లోన్ ప్రయోజనాలు..అప్రయోజనాలు ఏమిటి?
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!