AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బార్బీ గర్ల్‌గా సమంతా.. డ్రెస్ ఎంతో ప్రత్యేకం సుమీ!

అక్కినేని సమంత.. ఇటీవల నటించిన వరుస సినిమాలు విజయవంతం కావడంతో ఆమె ఇప్పుడు ఫుల్ జోష్‌లో ఉంది. ఆ సంతోషంతోనే హాలిడేను తన భర్త అక్కినేని నాగ చైతన్యతో ఇబిజాలో గడుపుతోంది. ఇది ఇలా ఉండగా సోషల్ మీడియాలో ఎప్పుడూ పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్‌కు టచ్‌లో ఉండే సామ్.. తాజాగా తన మామ కింగ్ నాగార్జున బర్త్‌డే అందరికన్నా ఎక్కువ ఆనందంగా జరుపుకున్నట్లు ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫొటోలే చెబుతున్నాయి. మామ నాగార్జునకు పుట్టినరోజు […]

బార్బీ గర్ల్‌గా సమంతా.. డ్రెస్ ఎంతో ప్రత్యేకం సుమీ!
Ravi Kiran
| Edited By: |

Updated on: Aug 31, 2019 | 1:36 PM

Share

అక్కినేని సమంత.. ఇటీవల నటించిన వరుస సినిమాలు విజయవంతం కావడంతో ఆమె ఇప్పుడు ఫుల్ జోష్‌లో ఉంది. ఆ సంతోషంతోనే హాలిడేను తన భర్త అక్కినేని నాగ చైతన్యతో ఇబిజాలో గడుపుతోంది. ఇది ఇలా ఉండగా సోషల్ మీడియాలో ఎప్పుడూ పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్‌కు టచ్‌లో ఉండే సామ్.. తాజాగా తన మామ కింగ్ నాగార్జున బర్త్‌డే అందరికన్నా ఎక్కువ ఆనందంగా జరుపుకున్నట్లు ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫొటోలే చెబుతున్నాయి.

మామ నాగార్జునకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ఆయన సిక్స్ ప్యాక్‌తో పూల్‌లో ఉన్న ఫోటోను పోస్ట్ చేసిన సామ్.. నాగ్ బర్త్‌డే పార్టీలో ఏకంగా పింక్ కలర్ డ్రెస్‌లో బార్బీ గర్ల్ మాదిరి అందంగా మెరిసింది. గురువారం జరిగిన నాగ్ పుట్టినరోజును అక్కినేని కుటుంబం ఇబిజాలో ఘనంగా జరుపుకున్నారు.

ఈ అకేషన్‌లో సామ్ ప్రత్యేకమైన లుక్‌లో తళుక్కుమంది. పార్టీ కోసం ఆమె వన్-షోల్డర్ షిమ్మర్ డ్రెస్‌, విలువైన కాస్ట్యూమ్స్‌ ధరించారు. ఆ డ్రెస్ ధర రూ.2 లక్షలు ఉంటుందని సమాచారం.  ఆ ఫోటోలను సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సామ్.. ఇటీవలే ఆమె జిమ్‌లో చేసిన కఠినమైన కసరత్తులతో పాటు వైరటీ వర్కౌట్‌లను కూడా ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తోంది. కాగా సమంత ప్రస్తుతం శర్వానంద్‌తో కలిసి ’96’ తెలుగు రీమేక్‌లో నటిస్తోంది. అటు నటిగా ఉంటూ ప్రజలకు సమాజసేవ చేస్తూ.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా వెలిగిపోతోంది.

View this post on Instagram

Nag mama says “Thankyou for all the love .. always and forever .. your blessings matter the most “

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on

View this post on Instagram

About last night ?

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on