అజ్ఞాతంలోకి చింతమనేని.. కేసుల భయంతో..
పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అజ్ఞాతంలోకి వెళిపోయారు. చింతనేని పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు కావడంతో.. అతన్ని అరెస్టు చేసేందుకు పోలీసులు గాలిస్తున్నారు. అంతేకాదు చింతమనేనితో పాటు ఆయన అనుచరులపైనా పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఇసుక తవ్వకాలకు సంబంధించిన వ్యవహారంలో తమను కులం పేరుతో దూషించారని చింతమనేని పై కొందరు స్థానికులు ఫిర్యాదు చేశారు. అయితే తనపై కక్షపూరితంగా కేసులు పెట్టారని మండిపడ్డారు. టీడీపీ ధర్నాలతో […]
పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అజ్ఞాతంలోకి వెళిపోయారు. చింతనేని పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు కావడంతో.. అతన్ని అరెస్టు చేసేందుకు పోలీసులు గాలిస్తున్నారు. అంతేకాదు చింతమనేనితో పాటు ఆయన అనుచరులపైనా పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఇసుక తవ్వకాలకు సంబంధించిన వ్యవహారంలో తమను కులం పేరుతో దూషించారని చింతమనేని పై కొందరు స్థానికులు ఫిర్యాదు చేశారు. అయితే తనపై కక్షపూరితంగా కేసులు పెట్టారని మండిపడ్డారు. టీడీపీ ధర్నాలతో ప్రభుత్వానికి భయం పట్టుకుందని ఆయన ఆరోపించారు. కావాలనే టీడీపీ నేతలపై కేసులు పెడుతున్నారని.. ఇసుక కార్మికులకు ప్రభుత్వం న్యాయం చేసేవరకూ.. తాము పోరాడతామని తేల్చిచెప్పారు.