భూ వివాదంతో.. సెల్ టవర్ ఎక్కిన మహిళ..

భూ వివాదంతో.. సెల్ టవర్ ఎక్కిన మహిళ..

నల్గొండ జిల్లాలో భూ వివాదం పరిష్కరించాలంటూ ఓ మహిళ సెల్ టవర్ ఎక్కి హల్‌చల్ చేసింది. నకిరేకల్ మండలం కడపర్థికి చెందిన సోమయ్యాకు ఇద్దరు భార్యలు ఉన్నారు. మొదటి భార్యకు పిల్లలు లేరని.. సొమయ్య అంజమ్మ అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. కాగా, అనారోగ్యంతో ఎనిమిదేళ్ల క్రితమే సోమయ్య మరణించాడు. అయితే అతడు చనిపోకముందే తనకు ఉన్న రెండు ఎకరాల భూమిని ఇద్దరి భార్యల పేరు మీద సమానంగా పంచాడు. కాగా, ఈ సంవత్సరం అంజమ్మ […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Aug 31, 2019 | 1:39 PM

నల్గొండ జిల్లాలో భూ వివాదం పరిష్కరించాలంటూ ఓ మహిళ సెల్ టవర్ ఎక్కి హల్‌చల్ చేసింది. నకిరేకల్ మండలం కడపర్థికి చెందిన సోమయ్యాకు ఇద్దరు భార్యలు ఉన్నారు. మొదటి భార్యకు పిల్లలు లేరని.. సొమయ్య అంజమ్మ అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. కాగా, అనారోగ్యంతో ఎనిమిదేళ్ల క్రితమే సోమయ్య మరణించాడు. అయితే అతడు చనిపోకముందే తనకు ఉన్న రెండు ఎకరాల భూమిని ఇద్దరి భార్యల పేరు మీద సమానంగా పంచాడు.

Woman Climbs Cell Tower Over Land Issues In Nalgonda District

కాగా, ఈ సంవత్సరం అంజమ్మ తన పొలంతో పాటు పక్కనే ఉన్న మొదటి భార్య పొలాన్ని కూడా దున్నింది. దీంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఒకరికి ఒకరు ఎంతకి తగ్గక పోగా, వివాదం కాస్త రచ్చకెక్కింది. తనకు న్యాయం చేయాలంటూ అంజమ్మ సెల్ టవర్ ఎక్కింది. తన పొలం తనకు అప్పగిస్తే తప్ప కిందికి దిగుతానని.. లేకపోతే పై నుంచి దూకేస్తానని గొడవ చేసింది. తనకు పిల్లలు కూడా లేరని.. ఇప్పుడు పొలం కూడా లాక్కుంటే తాను ఎలా బతకాలని ఆవేదన వ్యక్తం చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అంజమ్మకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చి కిందకు దించారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu