Tirumala: తిరుమలలో మరో అపశృతి.. ఘాట్‌రోడ్డులో ఆర్టీసీ బస్సు భీభత్సం! ఏం జరిగిందంటే..

Tirumala RTC Bus Accident: నిత్య కల్యాణోత్సవాలు, భక్తుల పారాయణాలు, వేద ఘోషతో ప్రజ్వరిల్లే తిరుమల వెంకన్న దేవస్థానం గత కొన్ని రోజులుగా వివాదాలకు నెలవుగా మారింది. మొన్నటికి మొన్న తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మృతి చెందారు. ఈ దారుణం మరువక ముందే సోమవారం నాడు మరో రెండు ప్రమాదాలు శ్రీవారి సన్నిధిలో జరగడం చర్చణీయాంశంగా మారింది..

Tirumala: తిరుమలలో మరో అపశృతి.. ఘాట్‌రోడ్డులో ఆర్టీసీ బస్సు భీభత్సం! ఏం జరిగిందంటే..
Tirumala RTC Bus Accident
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 13, 2025 | 6:05 PM

తిరుపతి, జనవరి 13: నిత్య కళ్యాణోత్యవాలు, పచ్చతోరణంగా నిత్యం వేద ఘోషతో ప్రజ్వరిల్లే తిరుమల తిరుపతి దేవస్థానం గత కొంత కాలంగా వివాదాలకు నెలవుగా మారింది. మొన్న వైకుంఠ ఏకాద‌శి టోకెన్ల కోసం జ‌రిగిన తొక్కిస‌లాట‌లో ఆరుగురు మృతి చెందిన సంగ‌తి తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే ఇవాళ (సోమవారం) లడ్డూ ప్రసాద కౌంటర్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. 7వ నెంబ‌ర్ ల‌డ్డూ కౌంట‌ర్‌ వద్ద చోటు చేసుకున్న ఈ ఘటనతో భక్తులు భయంతో వణికిపోయారు. చెల్లా చెదురుగా భక్తులంగా పరుగు లంకించుకున్నారు. ల‌డ్డూ టోకెన్లు జారీ చేసి కంప్యూట‌ర్‌కు సంబంధించిన యూపీఎస్‌లో ఒక్కసారిగా మంట‌లు చెల‌రేగ‌డంతో ఈ ప్రమాదం జ‌రిగిన‌ట్లు సమాచారం. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. హమ్మయ్య.. అనుకునేలోపే ఇదే రోజు తిరుమలలో మరో పెను ప్రమాదం తప్పింది. పదుల సంఖ్యలో భక్తుల ప్రాణాలు తృటితో తప్పించుకున్నాయి. అసలేం జరిగిందంటే..

భక్తులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఒకటి అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న ఓ పిట్టగోడను ఢీ కొట్టింది. హరిణి దాటిన తర్వాత రెండో ఘాట్‌ రోడ్డు వద్ద గోడను ఢీకొట్టింది. అయితే క్రాష్‌ బారియర్‌ పటిష్టంగా ఉండటంతో బస్సు లోయలోకి పడిపోకుండా రోడ్డుపైనే నిలిచిపోయింది. లేదంటే ఆర్టీసీ బస్సు పక్కనే ఉన్న లోయలోకి జారిపడి ఊహించని ప్రమాదం జరిగుండేది. తలచుకుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది. అదృష్టవశాత్తూ పెను ప్రమాదం తప్పింది. దీంతో శ్రీవారి భక్తులంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదం కారణంగా ఆర్టీసీ బస్సు రోడ్డు మధ్యలోనే అడ్డంగా నిలిచిపోయింది. దీంతో రాకపోకలకు అంతరాయం కలగడంతో కిలోమీటర్‌ మేర ట్రాఫిక్‌ నిలిచిపోయింది. విషయం తెలుసుకున్న సిబ్బంది క్రేన్‌ సహాయంతో బస్సును పక్కకు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో బస్సులోని పలువురు భక్తులు స్వల్పంగా గాయపడ్డారు.

సోమవారం ఒక్క రోజే గంటల వ్యవధిలో పరమ పవిత్రమైన తిరుమలలో రెండు ప్రమాదాలు జరిగాయి. గతంలోనూ మెట్ల మార్గంలో కౄర జంతువులు దాడి చేయడంతో పలువురు గాయపడ్డారు. చిరుత దడిలో ఓ చిన్నారి మృతి చెందింది కూడా. ఇలా వరుసగా ప్రమాదాలు జరగడం భక్తులకు మింగుడు పడటం లేదు.

ఇవి కూడా చదవండి

తిరుమల ఘాట్‌రోడ్‌లో దట్టమైన పొగమంచు.. వాహనదారులకు టీటీడీ విజ్ఞప్తి

తిరుమల ఘాట్‌రోడ్‌లో దట్టమైన పొగమంచు ఆవరించింది. ఈ క్రమంలో వాహన దారులు జాగ్రత్తగా ప్రయాణించాలని టీటీడీ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. తిరుమలకు వెళ్లే రెండవ ఘాట్ లో దట్టమైన పొగమంచు కారణంగా ఎదురుగా ఉన్న వాహనాలు సరిగ్గా కనపడక ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కనుక వాహనదారులు దయచేసి ఘాట్ రోడ్డు లో ప్రయాణించే సమయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కాగా శ్రీవారి లడ్డూ విక్రయ కేంద్రంలో సోమవారం 47వ కౌంటర్ లో యూపిఎస్ వైర్ కాలడంతో వ్యాపించిన పొగను.. వెంటనే అప్రమత్తమై సిబ్బంది అదుపు చేశారు.

సోషల్ మీడియాలో టీటీడీపై దుష్ప్రచారం.. నమ్మకండి: టీటీడీ ఛైర్మెన్ బీఆర్ నాయుడు

తిరుమల శ్రీవారి భక్తులకు మరింత మెరుగైన, పటిష్టమైన, పారదర్శకమైన సేవలు అందించేందుకు సమిష్టిగా నిర్ణయాలు తీసుకుంటున్నామని టీటీడీ ఛైర్మెన్ బీఆర్ నాయుడు తెలిపారు. తిరుమల అన్నమయ్య భవన్ లో సోమవారం టీటీడీ ఈవో, టీటీడీ అదనపు ఈవోలతో కలసి టీటీడీ ఛైర్మెన్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మెన్ బీఆర్ నాయుడు మాట్లాడుతూ.. శ్రీవారి భక్తులకు పాదర్శకంగా సేవలు అందించేందుకు పాలక మండలిలో సమిష్టిగా చర్చించి నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పారు. పాలకమండలి తీసుకునే నిర్ణయాలను అమలు చేయడంలో కొన్ని సాంకేతిక కారణాలతో ఆలస్యం అవుతుండవచ్చనేమో కాని, ఆలస్యం అవుతోందని తొందరపడి అసత్య ప్రచారం చేయవద్దని మీడియాను విజ్ఞప్తి చేశారు. తిరుమల విషయంలో ఒకటికి రెండు సార్లు పరిశీలించి, సంబంధిత వ్యక్తుల నుంచి వాస్తవ సమాచారాన్ని తెలుసుకుని వార్తలు రాయాలని సూచించారు. ఒకరిద్దరు మీడియా, సోషల్ మీడియాలో టీటీడీ ఛైర్మెన్ కు, ఈవో శ్యామల రావుకు మనస్పర్థలు ఉన్నాయంటూ వార్తలు రాయడం సరికాదన్నారు.

వైకుంఠ ఏకాదశికి శ్రీవారి భక్తులకు మెరుగైన సేవలు అందించామన్నారు. విద్యుత్ కాంతులు, పుష్పాలంకరణలు, క్యూలైన్లు, శ్రీవారి దర్శనం, అన్న ప్రసాదాలు, లడ్డూ ప్రసాదాలలో మరింత నాణ్యతగా అందించామన్నారు. తిరుపతిలో జరిగిన తోపులాట సంఘటన జరగడం సీఎం నారా చంద్రబాబు నాయుడు, తమను, దేశాన్ని, ప్రపంచాన్ని భాధించిందన్నారు. ఈ సంఘటనలో మృతి చెందిన కుటుంబాలకు , తీవ్రంగా గాయపడిన కుటుంబాలకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు. ఇప్పటికే 31 మందికి పరిహారం అందించామని, మరో 20 మందికి రెండు మూడు రోజుల్లో పరిహారం అందిస్తామన్నారు. చిన్న పొరపాట్లు చేయకుండా చాలా ముందు జాగ్రత్తతో సేవలు అందిస్తున్నామన్నారు.

సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేయవద్దు  – ఈవో జె శ్యామల రావు

టీటీడీకి సంబంధించి సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేయవద్దని టీటీడీ ఈవో జె శ్యామలరావు విన్నవించారు. కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియా చేస్తున్న అసత్య వార్తలను నమ్మవద్దని సూచించారు. టీటీడీలో పాలక మండలిలో చర్చించి తీసుకునే నిర్ణయాలను అమలు చేయడం తమ బాధ్యతన్నారు. టీటీడీ ఛైర్మెన్ , ఈవో మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవు, సమన్వయ లోపం అసలు లేదన్నారు. టీటీడీ ఛైర్మెన్ ను నేను ఏకవచంతో మాట్లాడినట్లు వచ్చిన వార్తలు నిజం కాదన్నారు. సాధారణ భక్తులకు పెద్ద పీట వేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించిన సూచన మేరకు అమలు చేస్తున్నామన్నారు. గత 6 నెలల కాలంలో భక్తులకు నాణ్యమైన అన్నప్రసాదాలు, లడ్డూ ప్రసాదాలు, నెయ్యి సేకరణ, వసతి తదితర సేవలు అందిస్తున్నామన్నారు. టీటీడీలో దళారి వ్యవస్థను పూర్తిగా కట్టడి చేస్తున్నామని, ఆన్ లైన్ లో మోసాలను ఎప్పటికప్పుడు అప్రమత్తంగా టీటీడీ విజిలెన్స్ విభాగం గుర్తించి చర్యలు తీసుకుంటున్నామన్నారు. టీటీడీలో విజన్ డాక్యుమెంట్ ప్రకారం మాస్టర్ ప్లాన్ ను అమలు చేస్తున్నామన్నారు. భక్తుల సౌకర్యార్థం అవసరమైన సందర్భాలలో వివిధ రంగాల నిపుణుల సూచనలు, సహకారం తీసుకోవడం గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతోందన్నారు.

ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు టీటీడీ ఈవో మాట్లాడుతూ వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ అంశంపై చాలా సమీక్షలు చేశామన్నారు. అనేకసార్లు తనిఖీలు, సమావేశాలు నిర్వహించి, ఏర్పాట్లపై విస్తృతంగా చర్చించామన్నారు. తిరుమలలో భక్తులకు శ్రీవారి దర్శనం, క్యూలైన్లు, అన్నప్రసాదాలు, కంపార్ట్మెంట్ల నిర్వహణ, వసతి, మరుగుదొడ్ల నిర్వహణ, తదితర అంశాలు పూర్తిగా టీటీడీ పరిధిలో ఉంటుందన్నారు, తిరుపతిలో జన రద్దీని ఎలా అదుపు చేయాలి, జన రద్దీ నిర్వహణ, క్యూలైన్ మేనేజ్మెంట్ , భద్రతా ఏర్పాట్లు, క్యూలైన్లు ఎక్కడ ఏర్పాటు చేయాలి, ఎంత ఎత్తులో ఉండాలి, ఎన్ని ఏర్పాటు చేయాలి, వాటి పటిష్టత ఎంత ఉండాలనే అంశాలు, పాలన, శాంతిభద్రతలు పూర్తిగా జిల్లా మేజిస్ట్రేట్ , జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో ఉంటుందన్నారు. వారి సూచనల మేరకు టిటిడి ఏర్పాట్లు చేసిందన్నారు. జిల్లా కలెక్టర్, ఎస్పీలతో సమన్వయం చేసుకుని, వారి సూచనల మేరకు టోకెన్లు జారీ చేసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. తోపులాటలు జరుగకుండా చూసే బాధ్యత పూర్తిగా పోలీసుల చేతిలో ఉంటుందన్నారు. భక్తుల తోపులాట అంశంపై జ్యూడిషియల్ ఎంక్వైరీ జరుగుతోందని, న్యాయ విచారణలో పూర్తి విషయాలు వెల్లడవుతాయన్నారు.

ప్రతి భక్తుడికి నాణ్యమైన సేవలు: అడిషనల్ ఈవో

తిరుమలలో ప్రతి భక్తుడికి నాణ్యమైన సేవలు అందించేందుకు గత ఆరు నెలలుగా అనేక సంస్కరణలు తీసుకువస్తున్నామని అడిషనల్ ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. దాతల విభాగాన్ని పూర్తిగా ఆడిట్ చేయించి అర్హులైన దాతలకు సేవలు అందేలా, మధ్యవర్తులను పూర్తిగా నిషేధించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. భక్తులకు వసతి ఎవరికి కేయించాలో తెలియని అగమ్య పరిస్థితి నుంచి మరింత పూర్తి పారదర్శకంగా వసతి గదులు కేటాయిస్తున్నామన్నారు. రాబోవు రోజులలో వసతి గదులు కేటాయింపులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భక్తుల వాట్సాప్ కే పూర్తి సమాచారం, రిజిస్ట్రేషన్ చేసే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఇటీవల భక్తులు ఎక్కువ సేపు వేచియుండకుండా శ్రీవారి దర్శనం కల్పిస్తున్నామన్నారు. విచక్షణ కోటాను , మానవ జోక్యాలను తగ్గించి భక్తులకు త్వరతిగతిన దర్శనం చేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి సందర్బంగా తిరుమల శ్రీవారి దర్శనాన్ని అన్ని తరగతుల వారికి భేషుగ్గా ఏర్పాటు చేశామన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

స్వీట్ ఫెస్టివల్ అదిరిపోయే ఉత్తరాఖండ్ ఫుడ్స్..
స్వీట్ ఫెస్టివల్ అదిరిపోయే ఉత్తరాఖండ్ ఫుడ్స్..
హెల్మెట్‌ లేకుంటే పెట్రోల్‌ విక్రయించరు.. ఆ రాష్ట్రంలో కొత్త రూల్
హెల్మెట్‌ లేకుంటే పెట్రోల్‌ విక్రయించరు.. ఆ రాష్ట్రంలో కొత్త రూల్
శొంఠితో ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని తెలిస్తే.. వదిలిపెట్టరు!
శొంఠితో ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని తెలిస్తే.. వదిలిపెట్టరు!
ఛాంపియన్ జట్టు లేకుండానే ఛాంపియన్స్ ట్రోఫీ.. 27 ఏళ్లలో తొలిసారి
ఛాంపియన్ జట్టు లేకుండానే ఛాంపియన్స్ ట్రోఫీ.. 27 ఏళ్లలో తొలిసారి
తిరుమలలో మరో అపశృతి.. ఏం జరిగిందంటే? ఒకే రోజు 2 ప్రమాదాలు
తిరుమలలో మరో అపశృతి.. ఏం జరిగిందంటే? ఒకే రోజు 2 ప్రమాదాలు
అక్కడ నలుగురు పిల్లల్ని కంటే.. లక్ష బహుమతి.. బంపర్ ఆఫర్ ఎక్కడంటే
అక్కడ నలుగురు పిల్లల్ని కంటే.. లక్ష బహుమతి.. బంపర్ ఆఫర్ ఎక్కడంటే
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఇంటికి ప్రధాని మోదీ, చిరంజీవి
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఇంటికి ప్రధాని మోదీ, చిరంజీవి
ఫ్రిజ్‌లో నిల్వ చేయకూడని కూరగాయలు
ఫ్రిజ్‌లో నిల్వ చేయకూడని కూరగాయలు
ఉడికించిన వేరుశనగ తింటున్నారా.. ఈ విషయాలు మీ కోసమే!
ఉడికించిన వేరుశనగ తింటున్నారా.. ఈ విషయాలు మీ కోసమే!
దేశీయ స్టాక్ మార్కెట్లు కుదేలు. రూ.12.39 లక్షల కోట్ల సంపద ఆవిరి
దేశీయ స్టాక్ మార్కెట్లు కుదేలు. రూ.12.39 లక్షల కోట్ల సంపద ఆవిరి