హైదరాబాద్‌లో భారీగా పట్టుబడ్డ వెండి
హైదరాబాద్‌లో భారీగా వెండి పట్టుబడింది. బోయిన్‌పల్లిలో వెండిని తరలిస్తున్న కంటైనర్‌ను పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడ్డ వెండి దాదాపు 10 టన్నుల వెండి విలువ దాదాపు.. రూ.35 కోట్ల రూపాయలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కంటైనర్ స్వాధీనం చేసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ వెండికి సబంధించిన ఎలాంటి డాక్యుమెంట్లు లేకపోవడంతో పోలీసులు సీజ్ చేశారు. ఈ కంటైనర్‌కు సెక్యూరిటీ సిబ్బందిగా ఉన్నవారి దగ్గర కూడా ఎలాంటి […]
హైదరాబాద్‌లో భారీగా వెండి పట్టుబడింది. బోయిన్‌పల్లిలో వెండిని తరలిస్తున్న కంటైనర్‌ను పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడ్డ వెండి దాదాపు 10 టన్నుల వెండి విలువ దాదాపు.. రూ.35 కోట్ల రూపాయలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కంటైనర్ స్వాధీనం చేసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు.
అయితే ఈ వెండికి సబంధించిన ఎలాంటి డాక్యుమెంట్లు లేకపోవడంతో పోలీసులు సీజ్ చేశారు. ఈ కంటైనర్‌కు సెక్యూరిటీ సిబ్బందిగా ఉన్నవారి దగ్గర కూడా ఎలాంటి పత్రాలు లేవు. దీంతో ఈ వెండి ఎవరిది..? ఎక్కడకు తీసుకెళ్తున్నారు.. ? అనే కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు.