ఝార్ఖండ్‌లో ఘోర ప్రమాదం, 11 మంది మృతి
ఝార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హజరీబాగ్ జిల్లాలోని చౌపారన్ దనువా ఘాటీ వద్ద.. ఓ బస్సు లారీని ఢీకొట్టింది. రాంచీ నుంచి పాట్నా వైపు ప్రయాణికులతో వెళ్తున్న బస్సు బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. దీంతో ఎదురుగా ఉన్న లారీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో పదకొండు మంది మృతి చెందారు. మరో 25 మంది వరకు గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని.. సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.