జక్కన్న అదిరిపోయే ఉగాది ట్రీట్.. ‘ఆర్ఆర్ఆర్’ టైటిల్ లోగో విడుదల..

రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న 'ఆర్ఆర్ఆర్' సినిమా మోష‌న్ పోస్ట‌ర్ ఉగాది సంద‌ర్భంగా బుధ‌వారం మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు విడుద‌లైంది. మోష‌న్ పోస్ట‌ర్‌లో ఆర్ అంటే రౌద్రం, ఆర్ అంటే రుధిరం, మ‌రో ఆర్ అంటే ర‌ణం అని చూపించారు. ఇందులో రామ్‌చ‌ర‌ణ్ అగ్ని క‌ణాల మ‌ధ్య‌, ఎన్టీఆర్‌ని స్వ‌చ్ఛ‌మైన జ‌లాల మ‌ధ్య‌ చూపించారు. రౌద్రానికి రుధిరానికి మ‌ధ్య జ‌రిగే ర‌ణంగా ఈ చిత్రం ఉండ‌బోతోంద‌ని మోష‌న్ పోస్ట‌ర్ చెప్ప‌క‌నే చెబుతోంది.

జక్కన్న అదిరిపోయే ఉగాది ట్రీట్.. 'ఆర్ఆర్ఆర్' టైటిల్ లోగో విడుదల..
Follow us
Ravi Kiran

|

Updated on: Mar 25, 2020 | 1:49 PM

RRR Movie Title: రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా మోష‌న్ పోస్ట‌ర్ ఉగాది సంద‌ర్భంగా బుధ‌వారం మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు విడుద‌లైంది. మోష‌న్ పోస్ట‌ర్‌లో ఆర్ అంటే రౌద్రం, ఆర్ అంటే రుధిరం, మ‌రో ఆర్ అంటే ర‌ణం అని చూపించారు. ఇందులో రామ్‌చ‌ర‌ణ్ అగ్ని క‌ణాల మ‌ధ్య‌, ఎన్టీఆర్‌ని స్వ‌చ్ఛ‌మైన జ‌లాల మ‌ధ్య‌ చూపించారు. రౌద్రానికి రుధిరానికి మ‌ధ్య జ‌రిగే ర‌ణంగా ఈ చిత్రం ఉండ‌బోతోంద‌ని మోష‌న్ పోస్ట‌ర్ చెప్ప‌క‌నే చెబుతోంది. డీవీవీ దాన‌య్య తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో ఒలీవియా మోరీస్‌, ఆలియాభ‌ట్‌, అజ‌య్‌దేవ్‌గ‌ణ్ ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జనవరి 8న విడుద‌ల కానుంది. ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళంలో తెర‌కెక్కిస్తున్నారు. 1920లో భార‌త‌దేశంలో జ‌రిగిన క‌థ‌గా రూపొందిస్తున్న‌ట్టు మోష‌న్ పోస్ట‌ర్‌ని బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది.

For More News:

ఏపీలో మరో కరోనా కేసు…

కొత్తగూడెం పోలీస్ అధికారి, వంట మనిషికి కరోనా.. 39కి చేరిన కేసులు..

ఇండియా లాక్ డౌన్.. ఏ సేవలకు బ్రేక్.? ఏవి ఉంటాయి.?

‘ఇంటికి రావద్దు ప్లీజ్’.. కరోనా అనుమానితుల ఇళ్లకు రెడ్ నోటిసులు..

కరోనా మరణ మృదంగం.. ప్రపంచవ్యాప్తంగా 18 వేలు దాటిన మరణాలు..

దేశంలో మొట్టమొదటి కోవిడ్ 19 ఆసుపత్రి.. రిలయన్స్ సంచలనం..

కేటీఅర్ అన్నా.. మా ఊరికి పంపండి.. సోదరి విజ్ఞప్తి..

ఈ లక్షణాలు ఉన్నా.. కరోనా వైరస్ సోకినట్లే..!

గుడ్ న్యూస్.. కరోనాలా హంటా వైరస్ కాదట… అసలు నిజమిదే.!