రోజ్…రోజ్…రోజ్…రోజ్…రోజా పువ్వా

  భారత్‌ నుంచి ఈ ఏడు సుమారు రూ. 28 కోట్ల విలువైన గులాబీలు ప్రపంచ వ్యాప్తంగా ఎగుమతి అవుతాయని అంచనా. గత ఏడాది రూ.23 కోట్ల విలువైన గులాబీలు ఎగుమతి అయ్యాయి. 2017లో ఈ మొత్తం రూ.19 కోట్లు మాత్రమే. భారత్‌ నుంచి వెళ్లే గులాబీల్లో అత్యధిక భాగం బ్రిటన్‌కు చేరుకొంటాయి. ఆ తర్వాత స్థానాల్లో మలేసియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, జపాన్‌లు ఉన్నాయి. మహారాష్ట్రలోని తలేగావ్‌‌ ప్రాంతం నుంచి ఇవి అత్యధికంగా ఎగుమతి అవుతాయి. ఈ […]

రోజ్...రోజ్...రోజ్...రోజ్...రోజా పువ్వా

భారత్‌ నుంచి ఈ ఏడు సుమారు రూ. 28 కోట్ల విలువైన గులాబీలు ప్రపంచ వ్యాప్తంగా ఎగుమతి అవుతాయని అంచనా. గత ఏడాది రూ.23 కోట్ల విలువైన గులాబీలు ఎగుమతి అయ్యాయి. 2017లో ఈ మొత్తం రూ.19 కోట్లు మాత్రమే.

భారత్‌ నుంచి వెళ్లే గులాబీల్లో అత్యధిక భాగం బ్రిటన్‌కు చేరుకొంటాయి. ఆ తర్వాత స్థానాల్లో మలేసియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, జపాన్‌లు ఉన్నాయి. మహారాష్ట్రలోని తలేగావ్‌‌ ప్రాంతం నుంచి ఇవి అత్యధికంగా ఎగుమతి అవుతాయి. ఈ ప్రాంతంలో ఇటీవల కాలంలో చలి పెరగడంతో ప్రేమికుల దినోత్సవం నాటికి సగానికి పైగా మొగ్గలు పవ్వులుగా మారే పరిస్థితి లేదు. కానీ అదృష్టవశాత్తు చివరి మూడురోజుల్లో ఎండలు రావడంతో భారీగా గులాబీలు అందుబాటులోకి వచ్చాయి. వాలెంటైన్స్‌డేతో పాటు వివాహ ముహుర్తాలూ ఉండటంతో రోజాపూల డిమాండ్‌ పెరిగిపోయింది.

వాలెంటైన్స్‌ డే, వివాహ ముహూర్తాలతో రోజాపూల ధరలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా బెంగళూరు, చెన్నై, ముంబయి, న్యూదిల్లీలలో ఒక్కో పువ్వు ధర రూ.15 వరకు పలుకుతోంది. 20 పువ్వుల బొకే ధర సుమారు రూ.300 వరకు పలుకుతోది. లండన్‌ మార్కెట్లో భారత్‌కు చెందిన ఒక్కో గులాబీకి సగటున రూ.28 ధర లభిస్తోంది. గులాబీ రైతులకు గత ఏడాది ఎకరాకు రూ.6 లక్షల వరకు ఆదాయం లభి౦చి౦ది.

Published On - 4:04 pm, Thu, 14 February 19

Click on your DTH Provider to Add TV9 Telugu