ఫార్మారంగ దిగ్గజం దివీస్‌‌‌‌‌ ల్యాబోరేటరీస్‌పై ఐటీ దాడులు

హైదరాబాద్: ప్రముఖ ఫార్మారంగ దిగ్గజం దివీస్ ల్యాబోరేటరీస్‌పై ఐటీ అధికారులు దాడులు చేపట్టారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సంస్థ పది కార్యాలయాలపై ఏక కాలంలో సోదాలు చేపట్టారు. గురువారం ఉదయం 8గంటల నుంచి ఈ దాడులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగులను కార్యాలయాల నుంచి వెళ్లకుండా అధికారులు అడ్డుకున్నారు. అల్పాహారం, మధ్యాహ్న భోజనం కూడా బయటి నుంచి కార్యాలయానికి తెప్పించుకోవాలని ఐటీ అధికారులు సూచించారు. మరోవైపు ఈ దాడులపై దివీస్ యాజమాన్యం స్పందించింది. ఐటీ అధికారులు […]

ఫార్మారంగ దిగ్గజం దివీస్‌‌‌‌‌ ల్యాబోరేటరీస్‌పై ఐటీ దాడులు

హైదరాబాద్: ప్రముఖ ఫార్మారంగ దిగ్గజం దివీస్ ల్యాబోరేటరీస్‌పై ఐటీ అధికారులు దాడులు చేపట్టారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సంస్థ పది కార్యాలయాలపై ఏక కాలంలో సోదాలు చేపట్టారు. గురువారం ఉదయం 8గంటల నుంచి ఈ దాడులు జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఉద్యోగులను కార్యాలయాల నుంచి వెళ్లకుండా అధికారులు అడ్డుకున్నారు. అల్పాహారం, మధ్యాహ్న భోజనం కూడా బయటి నుంచి కార్యాలయానికి తెప్పించుకోవాలని ఐటీ అధికారులు సూచించారు. మరోవైపు ఈ దాడులపై దివీస్ యాజమాన్యం స్పందించింది. ఐటీ అధికారులు వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలకు పూర్తి వివరాలు సమర్పిస్తామని సంస్థ అధికారులు చెప్పారు. తమ కంపెనీ నిబద్ధతతో పన్నులు చెల్లించి.. ఏటా ఐటీ అధికారులకు వివరాలు సమర్పిస్తుందని వారు అన్నారు.

Published On - 3:42 pm, Thu, 14 February 19

Click on your DTH Provider to Add TV9 Telugu