స్పైస్‌జెట్‌ ఎయిర్‌లైన్స్ నిర్వాక౦

స్పైస్‌జెట్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం బుధవారం ఉదయం 8గంటలకు ప్రయాణికులను ఎక్కించుకుని అహ్మదాబాద్‌ వెళ్లడానికి రన్‌వే వైపు కదిలింది. మరికొన్ని నిమిషాల్లో టేకాఫ్‌కు సిద్ధమవుతున్న విమానంలో సాంకేతిక లోపాన్ని పసిగట్టిన పైలట్‌ వెంటనే విమానాల రాకపోకల నియంత్రణ అధికారులకు సమాచారం అందించాడు. చిన్నపాటి సమస్యగా భావించిన అధికారులు, ప్రయాణికులను విమానంలోనే కూర్చోబెట్టి మరమ్మతులు చేయడానికి ప్రయత్నం చేశారు. మూడుగంటలైనా మరమ్మతులు కొలిక్కి రాకపోవడంతో విమానంలో కూర్చున్న ప్రయాణికులు ఎయిర్‌లైన్స్‌ సిబ్బందిని నిలదీశారు. ఎయిర్‌లైన్స్ సిబ్బ౦ది సమాధానంతో తృప్తిచె౦దని ప్రయాణికులు […]

స్పైస్‌జెట్‌ ఎయిర్‌లైన్స్ నిర్వాక౦

స్పైస్‌జెట్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం బుధవారం ఉదయం 8గంటలకు ప్రయాణికులను ఎక్కించుకుని అహ్మదాబాద్‌ వెళ్లడానికి రన్‌వే వైపు కదిలింది. మరికొన్ని నిమిషాల్లో టేకాఫ్‌కు సిద్ధమవుతున్న విమానంలో సాంకేతిక లోపాన్ని పసిగట్టిన పైలట్‌ వెంటనే విమానాల రాకపోకల నియంత్రణ అధికారులకు సమాచారం అందించాడు. చిన్నపాటి సమస్యగా భావించిన అధికారులు, ప్రయాణికులను విమానంలోనే కూర్చోబెట్టి మరమ్మతులు చేయడానికి ప్రయత్నం చేశారు.

మూడుగంటలైనా మరమ్మతులు కొలిక్కి రాకపోవడంతో విమానంలో కూర్చున్న ప్రయాణికులు ఎయిర్‌లైన్స్‌ సిబ్బందిని నిలదీశారు. ఎయిర్‌లైన్స్ సిబ్బ౦ది సమాధానంతో తృప్తిచె౦దని ప్రయాణికులు కిందకు దిగి విమానం ముందు బైఠాయించారు. ఆందోళన తీవ్రం కావడంతో స్పందించిన ఎయిర్‌లైన్స్‌ ప్రతినిధులు ఎట్టకేలకు మరమ్మతులను పూర్తి చేశారు. అనంతరం మధ్యాహ్నం ఒంటిగంటకు అహ్మదాబాద్‌కు విమానం బయల్దేరింది.

Spice Jet flight from Pune to Bangalore was delayed five full five hours on Sunday morning and the stranded passengers complained that they were not given any explanation by the airline staffers at the Lohegaon Airport. Express Photo,26.06.16

Published On - 2:52 pm, Thu, 14 February 19

Click on your DTH Provider to Add TV9 Telugu