సిద్ధిపేట ఘోర రోడ్డుప్రమాదం.. తాండూర్ సర్పంచ్ తోసహా ముగ్గురు మృతి

సిద్దిపేట జిల్లాలో జరిగిన ఘోర రోడ్డుప్రమాదం ముగ్గురి ప్రాణాలను బలితీసుకుంది. గజ్వేల్‌ మండలం ప్రజ్ఞాపూర్‌ వద్ద ఈ తెల్లవారుజూమున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని కారు ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న వారిలో ముగ్గురు ఘటనా స్థలంలోనే దుర్మరణం పాలయ్యారు.

సిద్ధిపేట ఘోర రోడ్డుప్రమాదం.. తాండూర్ సర్పంచ్ తోసహా ముగ్గురు మృతి
Follow us
Balaraju Goud

|

Updated on: Sep 03, 2020 | 9:24 AM

సిద్దిపేట జిల్లాలో జరిగిన ఘోర రోడ్డుప్రమాదం ముగ్గురి ప్రాణాలను బలితీసుకుంది. గజ్వేల్‌ మండలం ప్రజ్ఞాపూర్‌ వద్ద ఈ తెల్లవారుజూమున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని కారు ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న వారిలో ముగ్గురు ఘటనా స్థలంలోనే దుర్మరణం పాలయ్యారు. మరొకరికి తీవ్రంగా గాయాలయ్యాయి. మృతులను మంచిర్యాల జిల్లాకు చెందిన తాండూర్‌ సర్పంచ్‌ కొండు అంజిబాబు, జాగృతి నాయకులు యిడిదినేని గణేశ్‌, అంగల సాయిగా గుర్తించారు.

వీరు మంచిర్యాల నుంచి హైదరాబాద్‌ వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. వేగంగా ప్రయాణిస్తున్న కారు ముందు భాగం లారీ కిందకు దూసుకెళ్లడంతో నుజ్జునుజ్జయ్యింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రొక్లెయిన్‌ సాయంతో కారును బయటకు తీసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సిద్ధిపేట ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్లే ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.