ఇవాళ్టి నుంచి ఎంసెట్ హాల్‌టిక్కెట్లను ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..
తెలంగాణ లో ఎంసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వాహణ కోసం జేఎన్టీయూ షెడ్యూల్ విడుదల చేసింది. రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ (ఫార్మసీ, వెటర్నరీ) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించేందుకు ఎంసెట్ పరీక్ష ఈ నెల 9 నుంచి 14 వరకు జరగనుంది.
లంగాణ లో ఎంసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వాహణ కోసం జేఎన్టీయూ షెడ్యూల్ విడుదల చేసింది. రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ (ఫార్మసీ, వెటర్నరీ) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించేందుకు ఎంసెట్ పరీక్ష ఈ నెల 9 నుంచి 14 వరకు జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను ప్రభుత్వం ఇప్పటికే పూర్తిచేసింది.
సెప్టెంబర్ 9,10,11,14 తేదీల్లో ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్స్ లల్లో పరీక్ష జరగనుంది. ఇందుకోసం తెలంగాణ లో 79 , ఏపీలో 23పరీక్ష కేంద్రాలతో మొత్తం 102 సెంటర్లను ఏర్పాటు చేసింది. ఈ ఎంసెట్ ఎగ్జామ్ ను 1లక్ష 43 వేల 165 మంది పరీక్ష రాయనున్నారు. రేపటి నుండి ఈనెల7 వతేది వరకు www.eamcet.tsche.ac.in వెబ్ సైట్ ద్వారా హాల్ టికెట్స్ డౌన్ లోడ్ చేసుకోవచ్చని జేఎన్టీయూ కన్వీనర్ తెలిపారు. పరీక్ష కేంద్రాలకు వచ్చే అభ్యర్థులు మాస్కులు దరిస్తూ,డిస్టెన్స్ తప్పనిసరిగా పాటిస్తూ సానిటైజర్ వాడాలని ఈ సందర్భంగా సూచించారు.