Renu on Badri: బద్రి షూటింగ్ విశేషాలను గుర్తు చేసుకుని.. డైరెక్టర్ కి థాంక్స్ చెప్పిన రేణు దేశాయ్

Renu on Badri: ఎన్ని సినిమాలు చేసినా.... ఆ సినిమా మాత్రం నా లైఫ్‌లో చాలా స్పెషల్ అంటున్నారు నటి రేణు దేశాయ్‌. అందుకే ఆ సినిమా రిలీజ్‌డేట్‌ను...

Renu on Badri: బద్రి షూటింగ్ విశేషాలను గుర్తు చేసుకుని.. డైరెక్టర్ కి థాంక్స్ చెప్పిన రేణు దేశాయ్
Badri Movie
Follow us

| Edited By: Team Veegam

Updated on: Apr 21, 2021 | 7:14 PM

Renu on Badri: ఎన్ని సినిమాలు చేసినా…. ఆ సినిమా మాత్రం నా లైఫ్‌లో చాలా స్పెషల్ అంటున్నారు నటి రేణు దేశాయ్‌. అందుకే ఆ సినిమా రిలీజ్‌డేట్‌ను ప్రతీసారి స్పెషల్ గా సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు. ఈ రోజుకు బద్రికి సినిమా రిలీజ్‌ అయి 21 ఏళ్లు అయ్యాయి. ఈ సందర్భంగా రేణు చేసిన ట్వీట్ మరోసారి వైరల్‌గా మారింది.

పవర్‌ స్టార్ పవన్ కల్యాణ్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్ మూవీ బద్రి. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతోనే రేణు దేశాయ్‌ హీరోయిన్‌గా టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. ఈ రోజుకు ఈ సినిమా రిలీజ్ అయి 21 ఇయర్స్. ఈ సందర్భంగా మరోసారి ఆ సినిమా పట్ల తన ఎమోషన్‌ను అభిమానులతో షేర్ చేసుకున్నారు రేణు దేశాయ్‌.

బద్రి సినిమాలోని హే చికితా పాట షూట్ సందర్భంగా తీసిన ఓ ఫోటోను ఇన్‌స్టా పేజ్‌లో షేర్ చేసిన రేణూ… ‘నా దుప్పట్టానే నా సన్‌స్క్రీన్‌’ అంటూ కామెంట్ చేశారు. లాస్ట్ ఇయర్‌ కూడా ఈ మూవీ గురించి మాట్లాడిన రేణు ఎమోషనల్‌ అయ్యారు. తన ఫిలిం కెరీర్‌నేకాదు పర్సనల్ లైఫ్‌ను కూడా మలుపు తిప్పిన… సూపర్‌ హిట్ సినిమా ఇచ్చిన డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌కు థ్యాంక్స్‌ చెప్పారు.

18 ఏళ్ల వయసులో ఈ సినిమాతోనే నటిగా వెండితెరకు పరిచయం అయ్యారు రేణు దేశాయ్‌. అందుకే ఆ ఏజ్‌లో తనను నటిగా నమ్మినందుకు… తన కోసం సేఫెస్ట్ వర్క్‌ స్పేస్‌క్రియేట్ చేసినందుకు పూరి జగన్నాథ్‌కు థ్యాంక్స్ చెప్సారు రేణూ.

View this post on Instagram

A post shared by renu (@renuudesai)

Also Read: పోలీస్ మెట్లు ఎక్కిన కోడి పంచాయతీ… నా కోడిని చంపేశారంటూ ఓ వ్యక్తి ఫిర్యాదు

మొబైల్స్.పై కూడా కరోనా వైరస్.. స్మార్ట్ ఫోన్స్ ను సురక్షితంగా శుభ్రం చేసుకోవడం ఎలా అంటే..!