రాజన్న.. నిను మరవదు ఈ నేల..!

దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 70వ వర్ధంతి నేడు. 2009 సెప్టెంబర్ 2న చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమం కోసం వెళ్లిన ఆయన ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్‌లో సాంకేతిక లోపం రావడంతో కూలి మరణించారు. ఇవాళ్టికి ఆయన ప్రజలకు దూరమై సరిగ్గా పదేళ్లు. ఈ సందర్భంగా ప్రజల నేతగా పేరొందిన ఆయనను ఒకసారి స్మరించుకుందాం. 1949లో కడప జిల్లాలో జయమ్మ, రాజారెడ్డి దంపతులకు జన్మించిన రాజశేఖర్ రెడ్డి.. డాక్టర్‌ విద్యను అభ్యసించారు. విద్యార్థి దశ నుంచే […]

రాజన్న.. నిను మరవదు ఈ నేల..!
Follow us

| Edited By:

Updated on: Sep 02, 2019 | 10:47 AM

దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 70వ వర్ధంతి నేడు. 2009 సెప్టెంబర్ 2న చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమం కోసం వెళ్లిన ఆయన ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్‌లో సాంకేతిక లోపం రావడంతో కూలి మరణించారు. ఇవాళ్టికి ఆయన ప్రజలకు దూరమై సరిగ్గా పదేళ్లు. ఈ సందర్భంగా ప్రజల నేతగా పేరొందిన ఆయనను ఒకసారి స్మరించుకుందాం.

1949లో కడప జిల్లాలో జయమ్మ, రాజారెడ్డి దంపతులకు జన్మించిన రాజశేఖర్ రెడ్డి.. డాక్టర్‌ విద్యను అభ్యసించారు. విద్యార్థి దశ నుంచే రాజకీయాలవైపు ఆకర్షితుడైన ఆయన ఎస్.వి.ఆర్.ఆర్ కళాశాలలో పనిచేస్తుండగానే అక్కడ హౌస్‌ సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆ తరువాత వైద్యుడిగా పలుచోట్ల పని చేసిన ఆయన.. 1978లో కాంగ్రెస్ పార్టీలో చేరి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన.. 1980-82లో గ్రామాభివృద్ధి శాఖా మంత్రిగా, 1982లో ఎక్సైజ్ శాఖా మంత్రిగా, 1982-83 కాలంలో విద్యాశాఖా మంత్రిగా పనిచేసి అయా మంత్రిత్వ శాఖల్లో తనదైన ముద్రను వేశారు. అంతేకాదు ఆరోగ్యశాఖా మంత్రిగా పనిచేసిన కాలంలో ఒక్క రూపాయి మాత్రమే జీతంగా తీసుకుంటూ.. పలువురికి ఆదర్శంగా నిలిచారు.

ఇక 1983,1985ల్లోనూ పులివెందుల నుంచి గెలుపొందిన వైఎస్ గారూ.. అప్పట్లో ఏపీలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న సమయంలో తన పదునైన వ్యాఖ్యలతో అధికార పక్షానికి ముచ్చెమటలు పట్టించారు. ఆ సమయంలో వైఎస్ వాక్‌చాతుర్యం, నాయకత్వ లక్షణాలను మెచ్చిన అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ.. ఆయనకు ఏపీ రాష్ట్ర కాంగ్రెస్ ప్రెసిడెంట్ పదవిని కట్టబెట్టారు. ఆ తరువాత కడప నియోజకవర్గానికి జరిగిన 9,10,11,12వ లోక్ సభ ఎన్నికల్లో వరుసగా నాలుగు సార్లు గెలుపొందిన వైఎస్, 1999లో మళ్లీ పులివెందుల అసెంబ్లీ నుండి పోటీ చేసి గెలుపొందారు. అప్పుడు ప్రతిపక్ష పార్టీ హోదాలో కాంగ్రెస్ పార్టీని బలంగా ముందుకు నడిపించడం వైఎస్ వలనే సాధ్యమైంది. ఇక ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి ఎలానైనా తీసుకురావాలని సంకల్పించిన ఆయన.. 2003 వేసవికాలంలో పాదయాత్రను ప్రారంభించారు. ఉమ్మడి ఏపీలో 1,467కి.మీలు పాదయాత్ర చేసిన ఆయన.. ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకున్నారు. ఆ సమయంలో ఎంతోమంది అభిమానం చూరగొన్న ఆయన 2004లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి.. మొదటిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

ఇక అప్పుడే ఫీజు రీయింబర్స్‌మెంట్, 108, రాజీవ్ ఆరోగ్య శ్రీ, రాజీవ్ గృహకల్ప, పావలా వడ్డీ రుణాలు, రైతులకు ఉచిత కరెంట్ వంటి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిన ఆయన.. ఎంతోమంది ప్రజల గుండెల్లో ఆనందాన్ని నింపాడు. ముఖ్యంగా రైతులు, విద్యార్థులు, మధ్య తరగతి ప్రజల్లో ఆయన విశేషమైన నమ్మకాన్ని ఏర్పరకున్నాయి. దీంతో 2009లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లోనూ ఆయనకే పట్టం కట్టారు ప్రజలందరూ. అయితే విధి వక్రీకరించి.. రెండోసారి ముఖ్యమంత్రిగా అధికారాన్ని చేపట్టిన రెండు నెలలకే ఇదే రోజున తెలుగు ప్రజలందరినీ విడిచి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు వైఎస్సార్. ఆయన మరణవార్త విని ఎంతోమంది ప్రాణాలు ఆగిపోయాయి. రాజన్న ఒక్క మాట కూడా చెప్పకుండా.. మమ్మల్ని విడిచి ఎందుకు వెళ్లావు అంటూ ఆయన వలన లబ్ది పొందిన ప్రజలు వెక్కివెక్కి ఏడ్చారు. ‘‘ఎంతోమంది నాయకులు వచ్చి పోతుంటారు. కానీ కొంతమంది మాత్రమే ప్రజల గుండెల్లో స్థిర నివాసాన్ని నిలుపుకుంటారు’’ అలాంటి వారిలో వైఎస్సార్ ఒకరని చెప్పడంలో ఎంతమాత్రం సందేహం ఉండదు.

దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.