నిన్న లవ్ జిహాద్.. ఇవాళ హోమ్‌వర్క్ జిహాద్! పాకిపోతుంది మత మార్పిడి మంత్రం..!
జిహాద్ అంటే... లిటరల్‌గా చెప్పుకోవాలంటే ఒక పవిత్ర యుద్ధం. కానీ, అది కాస్తా ఇప్పుడు నిషేద పదంగా మారుతోందా? ఆశయ సాధన కోసం శక్తివంచన లేకుండా నిర్విరామంగా కృషి చేయడం లేదా పోరాడటాన్నే జిహాద్ అంటారు. మనసులోని చెడు ఆలోచనలతో, దురలవాట్లతో పోరాడుతూ, నిండైన దైవభక్తితో వ్యక్తిగతంగా మంచి జీవితాన్ని గడపడాన్ని కూడా గ్రేటర్ జిహాద్ అనొచ్చు. కానీ, ఈ పవిత్రమైన జిహాద్ అనే అరబిక్ పదానికి మారు పేర్లు పెట్టి, మారువేషాల్లో జనంలోకి విశృంఖలంగా ప్రయోగిస్తే..? అది శటానిక్ ఫైటే అవుతుంది. దాన్ని పాటిస్తే సైతాన్ పక్షం నిలబడి పోరాడిన వాళ్లమవుతాం. పనిగట్టుకుని ఒక మూకగా ఏర్పడి, మత మార్పిళ్లను ఒక ఉద్యమంలా సాగిస్తూ, జిహాద్‌కున్న పరమార్థాన్నే మార్చేస్తున్నారు కొందరు. ఒకప్పుడు ఉగ్రవాదానికి ఓనమాలుగా పుట్టిన జిహాద్, తర్వాత రంగులు మార్చుకుని పసిపిల్లల చిట్టి మెదళ్లను కూడా తొలిచేసే స్థాయికి చేరితే..? చేరితే కాదు, చేరిందన్న అనుమానం పుట్టినా అది ప్రమాదకరమే. కానీ, ఆ ప్రమాదం పొంచి ఉందా? ఊడలు దిగిన జిహాదీయిజమ్..!

నుదుటన తప్పనిసరిగా బొట్టు పెట్టుకోవాలి, శుక్లాం భరతరంతోనే క్లాసులు మొదలవ్వాలి, హనుమాన్ చాలీసా చదివాకే పరీక్షలు రాయాలి..! రాబోయే రోజుల్లో స్కూళ్లు, కాలేజీల్లో ఇటువంటి కండిషన్లు రాబోతున్నాయా? వినడానికి విచిత్రంగా అనిపించొచ్చు. కానీ, తెలంగాణలో ఇటువంటి సిగ్నల్సే క్లియర్‌గా వినిపించాయి. ఇక్కడ విద్యా జిహాద్ నడుస్తోంది.. స్కూల్ పిల్లలకు ఖురాన్ పాఠాలు నేర్పిస్తున్నారు.. అని గగ్గోలు పెడుతున్న కొన్ని పార్టీలు.. తమ ఫ్యూచర్ ప్లాన్లను ఇలా రాసేసుకున్నాయి. ఇంతటి అతివాదం ఎందుకొచ్చినట్టు..? పాతబస్తీలో జరిగిన ఒక ఉదంతం.. జిహాద్ టాపిక్‌ని సీరియస్‌గా మార్చేసింది. బార్డర్లు దాటి బరితెగిస్తున్న జిహాదీల సబ్జెక్ట్‌ని జనంలోకి లోతుగా తీసుకెళ్లి జరభద్రం అని హెచ్చరిస్తోంది మాయమాటలతో అమ్మాయిలకు వలవేసి, హనీట్రాప్ చేసి, పెళ్లిదాకా తీసుకొచ్చి మతం మార్పించి, తర్వాత గాలికి వదిలేయడం. దీనికున్న ముద్దుపేరు లవ్ జిహాద్. ఒక్క ఉత్తరప్రదేశ్‌లోనే గత మూడేళ్లలో 500కు పైగా ఇటువంటి లవ్ జిహాద్ కేసులు రిజిస్టర్ అయ్యాయి. ఇక, మహారాష్ట్ర లోని నాసిక్ TCS క్యాంపస్‌లో వలపు వల విసిరి మాస్ కన్వర్షన్స్‌కి పాల్పడింది ఒక గుంపు. మొత్తం ఐటీ సెక్టార్‌నే వణికించేసిన ఉదంతమిది. హెచ్‌ఆర్ డిపార్ట్‌మెంట్‌లో ముస్లిం మహిళలే మీడియేటర్లుగా అబ్బాయిలను ఉసిగొల్పిన దారుణమిది. హిజాబ్ తొడిగించి, ఖురాన్ చదివించి, పక్కా వెజిటేరియన్లతోనే బీఫ్ తినిపించిన పెర్ఫామెన్స్ వీళ్లది. ఇలా జిహాద్ ఉచ్చులో చిక్కుకున్న వేలాదిమంది మహిళా టెక్కీల్ని కాపాడ్డం పోలీసులకు పెద్ద సవాల్‌గా మారిందప్పుడు. మొన్నామధ్య మహారాష్ట్రలో ఫ్రెండ్‌షిప్ జిహాద్. ఇన్‌స్టాగ్రామ్‌లో...
