‘రెడ్’ భామ.. సమంతాకు సిస్టర్‌లా ఉందే..!

Red Movie Heroine Look Unveiled: మనుషులు పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని మన పెద్దలు అంటుంటారు. దీనికి ఆధారాలు అయితే లేవు గానీ.. కొన్నిసార్లు జరిగే సంఘటనలు బట్టి నమ్మాల్సి వస్తుంది. నాడు డైరెక్టర్ ఆర్జీవీ తన సినిమా ముంబై 26/11 కోసం కసబ్‌ పోలికలు ఉన్న వ్యక్తిని నటుడిగా పరిచయం చేస్తే.. ఆ తర్వాత లక్ష్మీస్ ఎన్టీఆర్‌ సినిమాలోని చంద్రబాబు పాత్ర కోసం ఉత్తరాదిన ఓ హోటల్‌లో పని చేసే సర్వర్‌ను తీసుకొచ్చారు. ఇక […]

'రెడ్' భామ.. సమంతాకు సిస్టర్‌లా ఉందే..!
Follow us
Ravi Kiran

|

Updated on: Feb 01, 2020 | 10:01 AM

Red Movie Heroine Look Unveiled: మనుషులు పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని మన పెద్దలు అంటుంటారు. దీనికి ఆధారాలు అయితే లేవు గానీ.. కొన్నిసార్లు జరిగే సంఘటనలు బట్టి నమ్మాల్సి వస్తుంది. నాడు డైరెక్టర్ ఆర్జీవీ తన సినిమా ముంబై 26/11 కోసం కసబ్‌ పోలికలు ఉన్న వ్యక్తిని నటుడిగా పరిచయం చేస్తే.. ఆ తర్వాత లక్ష్మీస్ ఎన్టీఆర్‌ సినిమాలోని చంద్రబాబు పాత్ర కోసం ఉత్తరాదిన ఓ హోటల్‌లో పని చేసే సర్వర్‌ను తీసుకొచ్చారు. ఇక ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం జరిగింది.

తాజాగా రామ్ హీరోగా తెరకెక్కుతున్న ‘రెడ్’ సినిమాలో హీరోయిన్ అమ్రితా అయ్యర్ చూడడానికి అచ్చం అక్కినేని కోడలు సమంత పోలికలు ఉండటం ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారి తీసింది. రీసెంట్‌గా విడుదలైన పోస్టర్‌లో.. కళ్లు.. ముక్కు.. పెదాలపై చిరునవ్వు.. ఎక్స్‌ప్రెషన్స్ అన్నీ చూస్తుంటే సమంతాకు సిస్టర్‌లా ఉందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ‘సమంతకు చెల్లిలా ఉన్నావ్’ అని ఒకరు కామెంట్ చేస్తే.. ‘నువ్వు అక్కినేని కోడలు బంధువా’ అంటూ మరొకరు పెట్టారు. కాగా, ఇంతకముందు బిగ్ బాస్ 3లో సమంతను పోలిన కంటెస్టెంట్ గురించి చర్చ జరిగిన సంగతి విదితమే.