దారుణం.. కొడుకు ప్రియురాలిపై అత్యాచారం చేసి.. ఆ తర్వాత..

మనుషులు రోజురోజుకు మరింత దిగజారిపోతున్నారు. వావివరుసలు కూడా మరచిపోతూ బరితెగిస్తున్నారు. కన్న కూతుర్లపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. అంతే కాకుండా.. కూతురు లాంటి కోడళ్లపై కూడా కన్నేస్తున్నారు. ఇక మరికొందరైతే.. మరింత దిగజారిపోతూ.. చిన్నారులను కూడా వదలట్లేదు. ఇలా కామాంధులు రెచ్చిపోతూ… ఆడవాళ్లపై నిత్యం ఎక్కడో ఓ చోట అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇదిలా ఉంటే.. మరికొందరు పైశాచికంగా ప్రవర్తిస్తూ.. వరుసకు కోడలు కావాల్సిన కొడుకు ప్రియురాళ్లపై అఘాయిత్యానికి పాల్పడుతున్నారు. తాజాగా తమిళనాడులో వెలుగులోకి వచ్చిన ఘటన.. సభ్య సమాజాన్ని […]

దారుణం.. కొడుకు ప్రియురాలిపై అత్యాచారం చేసి.. ఆ తర్వాత..

మనుషులు రోజురోజుకు మరింత దిగజారిపోతున్నారు. వావివరుసలు కూడా మరచిపోతూ బరితెగిస్తున్నారు. కన్న కూతుర్లపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. అంతే కాకుండా.. కూతురు లాంటి కోడళ్లపై కూడా కన్నేస్తున్నారు. ఇక మరికొందరైతే.. మరింత దిగజారిపోతూ.. చిన్నారులను కూడా వదలట్లేదు. ఇలా కామాంధులు రెచ్చిపోతూ… ఆడవాళ్లపై నిత్యం ఎక్కడో ఓ చోట అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇదిలా ఉంటే.. మరికొందరు పైశాచికంగా ప్రవర్తిస్తూ.. వరుసకు కోడలు కావాల్సిన కొడుకు ప్రియురాళ్లపై అఘాయిత్యానికి పాల్పడుతున్నారు. తాజాగా తమిళనాడులో వెలుగులోకి వచ్చిన ఘటన.. సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తోంది. వివరాల్లోకి వెళితే..

తమిళనాడు రాష్ట్రంలోని నాగపట్నం జిల్లాలో.. ఈ ఘటన చోటుచేసుకుంది. ముకేష్.. అనే యువకుడు ఓ అమ్మాయిని ప్రేమించాడు. అయితే ఆమెను వివాహం చేసుకుంటానంటే.. ఆ కుమారుడి తండ్రి అభ్యంతరం చెప్పాడు. అయితే అమ్మాయి లేకపోతే చచ్చిపోతానని బెదిరింపులకు దిగడంతో.. కుమారుడిని ప్రేయసితో దూరంచేసేందుకు నీచమైనా పనికి ఒడిగట్టాడు. కుమారుడి ప్రియురాలి ఇంటికి వెళ్లిన ముకేష్ తండ్రి నిత్యానందం.. నీకు పెళ్లిచేస్తానంటూ వెంట తీసుకొచ్చాడు. అనంతరం ఆమెను మార్గమధ్యంలో ఓ గదిలో నిర్భందించాడు. అనంతరం ఆమెకు తాళి కట్టి.. ఇక నుంచి తనతోనే సంసారం చేయాలంటూ బెదిరింపులకు పాల్పడుతూ.. పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టాడు. ఇటు కుమారుడితో.. సదరు అమ్మాయి వేరే పెళ్లి చేసుకోబోతందంటూ కొడుకును నమ్మించసాగాడు. అయితే అనూహ్యంగా నిర్బంధంలో ఉన్న యువతి తప్పించుకుని వేదారణ్యం మహిళా పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో ఆ కామంధుడి తండ్రి కథ బట్టబయలైంది.

Published On - 9:58 am, Sat, 1 February 20

Click on your DTH Provider to Add TV9 Telugu