AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మంథనిలో టైమ్ మిషన్‌లో గణనాథుడు.. ‘ఆదిత్య 369’ స్ఫూర్తితో వినాయకుడి ఊరేగింపు!

Time Machine Ganesh Manthani: పెద్దపల్లి జిల్లా మంథనిలో గణపతి నిమజ్జన ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ‘ఆదిత్య 369’ స్ఫూర్తితో రూపొందించిన టైమ్ మిషన్‌లో గణనాథుడిని ఆసీనులను చేసి ఊరేగించారు. భజనలు, కోలాటాలు, సాంస్కృతిక ప్రదర్శనలతో సాగిన ఈ వేడుకకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

మంథనిలో టైమ్ మిషన్‌లో గణనాథుడు.. ‘ఆదిత్య 369’ స్ఫూర్తితో వినాయకుడి ఊరేగింపు!
Time Machine Ganesh Manthani
Rajashekher G
|

Updated on: Sep 26, 2026 | 12:05 AM

Share

దేశవ్యాప్తంగా గణనాథుడి నిమజ్జన కార్యక్రమాలు వైభవంగా కొనసాగుతున్నాయి. పలు ప్రాంతాల్లో వినాయకుడి నిమజ్జన ఊరేగింపులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ క్రమంలో పెద్దపల్లి జిల్లా మంథనిలో విశ్వబ్రాహ్మణ గజానన మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన గణపతి నిమజ్జన ఊరేగింపు అందరి దృష్టిని ఆకర్షించింది.

ప్రతి ఏడాది వినూత్న అలంకరణలు, ప్రత్యేక ఆకృతులతో గణపతి నిమజ్జనాన్ని నిర్వహించే విశ్వబ్రాహ్మణులు.. ఈసారి సినీ చిత్రం ‘ఆదిత్య 369’ స్ఫూర్తితో ఏకంగా టైమ్ మిషన్ ఆకృతిని రూపొందించారు. ఈ టైమ్ మిషన్‌లో గణనాథుడిని ఆసీనులను చేసి ఘనంగా నిమజ్జన ఊరేగింపు నిర్వహించారు.

మంథనిలో విశ్వబ్రాహ్మణ గజాననుడి ఊరేగింపు ప్రతి ఏడాది ప్రత్యేకతను సంతరించుకుంటుండటంతో.. ఈసారి ఎలాంటి అలంకరణ చేస్తారనే ఆసక్తి స్థానికుల్లో నెలకొంది. అందరి అంచనాలకు తగ్గట్టుగానే టైమ్ మిషన్‌లో గణనాథుడు ఊరేగింపుగా రావడంతో భక్తులు, ప్రజలు ఆసక్తిగా తిలకించారు.

ఇవి కూడా చదవండి

ఊరేగింపు సందర్భంగా మహిళా భక్తులు గణనాథుడికి హారతులు ఇచ్చి భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేశారు. విశ్వబ్రాహ్మణుల భజనలు, మహిళల కోలాటాలు, వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు నిమజ్జన వేడుకలకు మరింత సందడి తీసుకొచ్చాయి.

విశ్వబ్రాహ్మణ గజానన మండలి ఆధ్వర్యంలో గత కొన్ని దశాబ్దాలుగా గణపతి నిమజ్జన ఊరేగింపులను వినూత్నంగా నిర్వహిస్తున్నారు. గతంలో టైటానిక్ షిప్, హెలికాప్టర్, కేదారనాథ్ ఆలయం, అయోధ్య రామ మందిరం తదితర ఆకృతులను రూపొందించి వాటిలో గణనాథుడిని ఊరేగింపుగా తీసుకెళ్లారు.

తాజాగా రూపొందించిన టైమ్ మిషన్ కూడా ఆకట్టుకునేలా ఉండటంతో నిమజ్జన ఊరేగింపుకు సంబంధించిన దృశ్యాలను పలువురు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దీంతో ఈ వినూత్న గణపతి ఊరేగింపు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

వీడియో చూడండి..

Follow Us