AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సెప్టెంబర్ 26 రాశిఫలాలు: ఈ రాశుల వారికి కెరీర్‌లో కీలక మార్పులు.. ఆర్థికంగా లాభాలు

Horoscope Today (September 26, 2026): శనివారం గ్రహాల సంచారం కారణంగా 12 రాశుల వారి జీవితాల్లో భిన్నమైన ఫలితాలు కనిపించే అవకాశం ఉంది. మేష రాశి వారికి ఉద్యోగంలో ప్రాధాన్యం, ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభించవచ్చు. వృషభ రాశి వారికి ఆర్థిక ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలత పెరగడంతో పాటు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. మరి మేషం నుంచి మీనం వరకు మిగతా రాశుల వారికి శనివారం రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

సెప్టెంబర్ 26 రాశిఫలాలు: ఈ రాశుల వారికి కెరీర్‌లో కీలక మార్పులు.. ఆర్థికంగా లాభాలు
Horoscope Today 26 Sep 2026
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 26, 2026 | 6:00 AM

Share

దిన ఫలాలు (సెప్టెంబర్ 26, 2026): మేష రాశి వారికి ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. కొన్ని ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పట్టడానికి అవకాశం ఉంది. వృషభ రాశి వారికి ఆర్థిక ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. పిల్లలు చదువుల్లో, ఉద్యోగ ప్రయత్నాల్లో ఘన విజయాలు సాధిస్తారు. మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగాలలో అనుకూలత బాగా పెరుగుతుంది. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిగా రాబడి పెరగడానికి, కొన్ని ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పట్టడానికి అవకాశం ఉంది. గృహ, వాహన ప్రయత్నాలు సఫలమవుతాయి. కొత్త ఉద్యోగానికి సంబంధించి అనుకూల సమాచారం అందుతుంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో సానుకూలంగా ఫలితాలుంటాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరు స్తాయి. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. ప్రయాణాల వల్ల బాగా లాభం కలుగుతుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఉద్యోగ వాతావరణం ప్రోత్సాహకరంగా ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలు, ప్రయత్నాల్లో కార్యసిద్ధి ఉంటుంది. వ్యాపారాలు ఆశాజనకంగా పురోగమి స్తాయి. పిల్లల వల్ల ఒకటి రెండు సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. డాక్టర్లు, లాయర్లు తదితన వృత్తి రంగాలకు చెందినవారికి డిమాండ్ బాగా పెరుగుతుంది. వృత్తి నిపుణులకు సరికొత్త అవకాశాలు కలిసి వస్తాయి. ఆర్థిక ప్రయత్నాలు ఆశిం చిన ఫలితాలనిస్తాయి. పిల్లలు చదువుల్లో, ఉద్యోగ ప్రయత్నాల్లో ఘన విజయాలు సాధిస్తారు.

ఇవి కూడా చదవండి

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

వృత్తి, ఉద్యోగాలలో అనుకూలత బాగా పెరుగుతుంది. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. మొండి బాకీలు సైతం వసూలవుతాయి. వ్యాపారాలు లాభసాటిగా పురోగమిస్తాయి. వ్యక్తిగత సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారమవుతుంది. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఆర్థికంగా కలిసి వస్తుంది. ముఖ్యంగా ఆదాయం పెరుగుతుంది. కుటుంబ ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. కొందరు బంధుమిత్రుల వల్ల డబ్బు నష్టం జరగవచ్చు. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిగా రాబడి పెరుగుతుంది. ఉద్యోగంలో పనిభారం ఉన్నప్పటికీ సకాలంలో లక్ష్యాలు, బాధ్యతలను పూర్తి చేస్తారు. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఎవరికీ వాగ్దానాలు చేయడం, హామీలు ఉండడం చేయవద్దు. ప్రయాణాల్లో జాగ్రత్తగా జాగ్రత్తగా ఉండాలి. ఇతరుల మీద ఎక్కువగా ఆధారపడవద్దు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

బంధుమిత్రులు మీ సలహాలు, సూచనలు స్వీకరించి లబ్ధి పొందుతారు. ఆర్థిక ప్రయత్నాలు చాలా వరకు సఫలమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఉచిత సహాయాలకు, దానధర్మాలకు దూరంగా ఉండడం మంచిది. ఆర్థికంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. ప్రయాణాలు లాభిస్తాయి. ఉద్యోగ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో కొత్తగా ఆర్థిక సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలి. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తే ముఖ్యమైన పనులు,వ్యవహారాలన్నీ పూర్తవుతాయి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

భాగస్వాముల సహాయ సహకారాలతో వృత్తి, వ్యాపారాల్లో ముందుకు దూసుకు వెడతారు. ఉద్యోగ జీవితం సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. బంధువుల్లో పెళ్లి నిశ్చయం అయ్యే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా చక్కబడ తాయి. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. జీవిత భాగస్వామి వృత్తి, ఉద్యోగాలకు సంబంధించి ఆశించిన సమాచారం అందుకుంటారు. బంధుమిత్రులకు ఆర్థికంగా బాగా సహాయం చేస్తారు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

వృత్తి, ఉద్యోగాలు అనుకూలంగా సాగిపోతాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాల్లో దగ్గర బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. కొత్త వ్యాపారం ఒకటి ప్రారంభించడం జరుగుతుంది. కుటుంబ సభ్యుల తోడ్పాటుతో కీలకమైన పనులు, వ్యవహారాల్ని పూర్తి చేస్తారు. పిల్లల్లో ఒకరికి సంబంధించి ముఖ్యమైన శుభ వార్త అందుతుంది. మీ ఆలోచనలను, నిర్ణయాలను ఆచరణలో పెట్టడానికి ఇది సరైన సమయం.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో శ్రమాధిక్యత పెరుగుతుంది. నిరుద్యో గుల ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. కుటుంబ వ్యవహారాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. అదనపు ఆదాయ ప్రయత్నాలు కలిసి వస్తాయి. దగ్గర బంధువుల్లో ఒకరి ఆరోగ్యం కొద్దిగా ఆందోళన కలిగిస్తుంది. వ్యాపారాలు నిలకడగా పురోగమిస్తాయి. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లో ఉద్యోగం లభించే సూచనలున్నాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాలను, పనులను సకాలంలో పూర్తి చేస్తారు. తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితం పొందుతారు. ఉద్యోగంలో అధికారులతో సామరస్యం ఏర్పడుతుంది. సోదరులతో స్థిరాస్తి వివాదం ఒకటి సానుకూలంగా పరిష్కారం అవుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాలకు వెళ్లడం జరుగుతుంది. విదే శాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. బంధువులతో పెళ్లి సంబంధం కుదురుతుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఉద్యోగ జీవితం ఉత్సాహంగా, ప్రోత్సాహకరంగా సాగిపోతుంది. అధికారులకు మీ సలహాలు, సూచ నలు ఉపయోగపడతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక ఒత్తిడి నుంచి విముక్తి లభిస్తుంది. వ్యక్తిగత పనులు, కుటుంబ వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. ఇతరుల నుంచి రావలసిన డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. కుటుం బంలో సామరస్య వాతావరణం నెలకొంటుంది. నిరుద్యోగులకు శుభవార్త అందే అవకాశం ఉంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఉద్యోగంలో బాధ్యతలు పెరిగి కొద్దిగా శ్రమ, ఒత్తిడి అనుభవానికి వస్తాయి. ఎటువంటి పొరపాట్లూ జరగకుండా చూసుకోవాల్సి ఉంటుంది. మిత్రుల సహాయంతో ముఖ్యమైన పనులు, వ్యవహారాల్ని చక్కబెడతారు. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. సోదరులతో స్థిరాస్తి వివాదాలను పరిష్కరించుకుంటారు. కుటుంబంలో శుభకార్యానికి అవకాశం ఉంది. చిన్ననాటి స్నేహితులతో సరదాగా గడుపుతారు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

అదనపు ఆదాయ ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. కుటుంబ వ్యవహారాల్లో సానుకూల దృక్పథంతో వ్యవహరించడం మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో మీ మాట బాగా చెల్లుబాటవుతుంది. నిరుద్యోగులకు ఆశించిన కంపెనీ నుంచి ఆఫర్ అందే అవకాశం ఉంది. వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలు కనిపిస్తాయి. వ్యాపార భాగ స్వాము లతో వివాదాలు ఒక కొలిక్కి వచ్చే సూచనలున్నాయి. ప్రయాణాలలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి.

Follow Us