AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేతు నక్షత్ర గోచారం ఎఫెక్ట్.. ఆర్థిక, కుటుంబ విషయాల్లో ఆ రాశుల వారు జాగ్రత్త..!

కేతువు అక్టోబర్ 3, 2026న మఘా నక్షత్రంలోని మొదటి పాదంలోకి ప్రవేశించనున్నాడు. సింహ రాశిలో జరిగే ఈ నక్షత్ర గోచారం జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం కొన్ని రాశులపై ప్రత్యేక ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా వృషభం, కర్కాటకం, సింహం, కన్య రాశుల వారికి కుటుంబం, ఆర్థిక పరిస్థితులు, ఖర్చులు, మానసిక ప్రశాంతత వంటి అంశాల్లో మార్పులు కనిపించే ఛాన్స్ ఉంది. ఈ సమయంలో ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండటంతో పాటు మాటతీరు, కుటుంబ సంబంధాల విషయంలో సంయమనం పాటించడం మంచిది.

కేతు నక్షత్ర గోచారం ఎఫెక్ట్.. ఆర్థిక, కుటుంబ విషయాల్లో ఆ రాశుల వారు జాగ్రత్త..!
Ketu Star Transit
Janardhan Veluru
|

Updated on: Sep 25, 2026 | 4:35 PM

Share

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం కేతువు వైరాగ్యం, ఆధ్యాత్మికత, రహస్యాలు, అనుకోని మార్పులకు ప్రతీకగా భావిస్తారు. 2026 అక్టోబర్ 3న కేతువు మఘా నక్షత్రంలోని మొదటి పాదంలోకి ప్రవేశించనున్నాడు. ఈ సమయంలో కేతువు సింహ రాశిలోనే కొనసాగుతాడు. మఘా నక్షత్రానికి పితృదేవతలు, పూర్వీకులు, సంప్రదాయాలు, గౌరవం, అధికారంతో సంబంధం ఉందని జ్యోతిష్య శాస్త్రంలో నమ్ముతారు. మఘా నక్షత్రాధిపతి కూడా కేతువే కావడంతో ఈ నక్షత్ర మార్పును ప్రత్యేకంగా పరిగణిస్తున్నారు. మఘా మొదటి పాదం మేష నవాంశానికి సంబంధించినదిగా చెబుతారు. అందువల్ల ఈ సమయంలో నిర్ణయాలు, కుటుంబ వ్యవహారాలు, వ్యక్తిగత ప్రవర్తన వంటి అంశాల్లో మార్పులు కనిపించే అవకాశం ఉంది.

వృషభ రాశి

వృషభ రాశి వారికి కేతువు నాలుగో స్థానంలో ఉండనున్నాడు. ఈ స్థానం ఇల్లు, కుటుంబం, తల్లి, ఆస్తి, మానసిక ప్రశాంతతకు సంబంధించినదిగా భావిస్తారు. ఈ సమయంలో కుటుంబ వ్యవహారాల్లో కొంత మేరకు ఒంటరితనం అనుభవంలోకి వచ్చే అవకాశముంది. గతంలో పరిష్కారం కాని ఆస్తి సంబంధిత అంశాలు మళ్లీ చర్చకు రావచ్చు. వాహనాల విషయంలోనూ జాగ్రత్త అవసరం. ఇల్లు మార్చడం లేదా ఆస్తికి సంబంధించిన పెద్ద నిర్ణయాలను తొందరపడి తీసుకోకుండా ఉండటం మంచిది. పితృదేవతల పేరుతో అన్నదానం లేదా నీటిని దానం చేయడం, కుటుంబంలోని పెద్దలను గౌరవించడం శుభప్రదంగా భావిస్తారు.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి కేతువు రెండో స్థానంలో ప్రభావం చూపనున్నాడు. ఈ స్థానం డబ్బు, కుటుంబం, మాటతీరు, పొదుపులకు సంబంధించినదిగా పరిగణిస్తారు. ఈ సమయంలో ఆర్థిక విషయాల్లో కొంత అసంతృప్తి లేదా పొదుపు తగ్గే పరిస్థితి ఎదురయ్యే అవకాశముంది. అనుకోని ఖర్చులు ఎదురయ్యే అవకాశం ఉన్నందున బడ్జెట్ విషయంలో జాగ్రత్త అవసరం. ముఖ్యంగా మాట విషయంలో సంయమనం పాటించాలి. ఆవేశంలో మాట్లాడటం కుటుంబ సభ్యులతో విభేదాలకు దారితీసే అవకాశముంది. అవసరమైన వారికి ఆహారం అందించడం, శ్రీరామ నామస్మరణ చేయడం వంటి పరిహారాలు ఊరటనిస్తాయి.

ఇవి కూడా చదవండి

సింహ రాశి

సింహ రాశిలోనే కేతువు సంచరిస్తున్నాడు. ఇప్పుడు మఘా నక్షత్రంలోని మొదటి పాదంలోకి ప్రవేశించడంతో సింహ రాశి వారికి ఈ మార్పు ప్రత్యేకంగా పరిగణించబడుతోంది. వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం, జీవిత దిశకు సంబంధించిన విషయాల్లో కొంత అయోమయం ఏర్పడే అవకాశముంది. ఒక పని మీద ఆసక్తి పెరిగిన తర్వాత అకస్మాత్తుగా దాని నుంచి దూరం కావాలనే ఆలోచన కూడా రావచ్చు. వ్యక్తిగత సంబంధాల్లో అవసరానికి మించి దూరం పెంచుకోకుండా ఉండటం మంచిది. ప్రతిరోజూ సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం, ఆదివారం గోధుమలు లేదా బెల్లం దానం చేయడం వంటి పరిహారాలు చేయాలి.

కన్య రాశి

కన్య రాశి వారికి కేతువు పన్నెండో స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ స్థానం ఖర్చులు, విదేశీ వ్యవహారాలు, ఏకాంతం, నిద్ర, మానసిక ఒత్తిడికి సంబంధించినది. ఈ కాలంలో అవసరం లేని ఖర్చులు పెరిగే అవకాశముంది. కొంత పెట్టుబడి పెట్టినా దాని ప్రయోజనం వెంటనే కనిపించకపోవచ్చు. నిద్ర, విశ్రాంతిని నిర్లక్ష్యం చేయడం వల్ల రోజువారీ పనితీరుపై ప్రభావం పడే అవకాశం ఉందని చెబుతున్నారు. విదేశాలు లేదా దూర ప్రాంతాలకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించడం మంచిది. మంగళవారం హనుమంతుడి ఆలయంలో బెల్లం, శనగల నైవేద్యం సమర్పించడం, అవసరమైన వారికి ఆహారం అందించడం వంటి పరిహారాలు చేయాలి.

(గమనిక: ఈ కథనంలో ఇచ్చిన ఫలితాలు వేద జ్యోతిష్య విశ్వాసాలు, నమ్మకాల ఆధారంగా రూపొందించినవి. వ్యక్తిగత జాతకంలో గ్రహస్థితులు, దశలు, ఇతర అంశాలను బట్టి ఫలితాల్లో మార్పులు ఉండవచ్చు)

Follow Us
కేతు నక్షత్ర గోచారం ఎఫెక్ట్.. ఆర్థిక విషయాల్లో వారు జాగ్రత్త
కేతు నక్షత్ర గోచారం ఎఫెక్ట్.. ఆర్థిక విషయాల్లో వారు జాగ్రత్త
జగిత్యాల గణేష్ నిమజ్జన బందోబస్తులో భాగమైన ట్రాన్స్‌జెండర్స్
జగిత్యాల గణేష్ నిమజ్జన బందోబస్తులో భాగమైన ట్రాన్స్‌జెండర్స్
కనుబొమ్మలు పలుచగా ఉన్నాయా? దట్టంగా కనిపించాలంటే నేచురల్ టిప్స్!
కనుబొమ్మలు పలుచగా ఉన్నాయా? దట్టంగా కనిపించాలంటే నేచురల్ టిప్స్!
జామ ఆకులను ఇలా వాడితే జుట్టు సమస్యలకు చెక్..
జామ ఆకులను ఇలా వాడితే జుట్టు సమస్యలకు చెక్..
ఏటీఎం లావాదేవీలు ఫ్రీ.. ఒక్క రూపాయి కూడా ఛార్జీలు ఉండవ్..
ఏటీఎం లావాదేవీలు ఫ్రీ.. ఒక్క రూపాయి కూడా ఛార్జీలు ఉండవ్..
రన్నింగ్ vs సైక్లింగ్.. బరువు తగ్గడానికి ఏది మంచిదో తెలుసా?
రన్నింగ్ vs సైక్లింగ్.. బరువు తగ్గడానికి ఏది మంచిదో తెలుసా?
APPSC Group 1 దరఖాస్తుకు ముందు అభ్యర్థులు తప్పక తెలుసుకోవాలి
APPSC Group 1 దరఖాస్తుకు ముందు అభ్యర్థులు తప్పక తెలుసుకోవాలి
AI తప్పిదం వల్లే.. ఇరాన్ పాఠశాలపై అమెరికా బాంబుల వర్షం
AI తప్పిదం వల్లే.. ఇరాన్ పాఠశాలపై అమెరికా బాంబుల వర్షం
ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ వైఖరిని ప్రశ్నించిన కిషన్ రెడ్డి
ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ వైఖరిని ప్రశ్నించిన కిషన్ రెడ్డి
ఐబొమ్మ పైరసీ కేసులో బిగ్‌ అప్‌డేట్.. ఇమంది రవీకి భారీ ఊరట!
ఐబొమ్మ పైరసీ కేసులో బిగ్‌ అప్‌డేట్.. ఇమంది రవీకి భారీ ఊరట!