ఆంధ్రప్రదేశ్ : నేటి నుంచే ఇంటికి పింఛన్..

ఇప్పటివరకు పింఛన్‌ బ్యాంకు ఖాతాల్లో పడటం, లబ్దిదారులు వెళ్లి పంచాయితీ స్టాఫ్ దగ్గర తెచ్చుకోవడం చూశాం. కానీ ఇకపై ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఎవరికి కమీషన్ ఇవ్వాల్సిన పనిలేదు. ప్రతి నెలా 1వ తేదీన పెన్షన్ మీ ఇంటికే వస్తుంది. ఇటీవల ఏపీ ప్రభుత్వం నియమించిన గ్రామ, వార్డు వాలంటీర్లు ఈ బాధ్యతను నిర్వర్తిస్తారు. వారికి లంచం లాంటివి ఇస్తే..ఇచ్చినవారు, పుచ్చుకున్నవారు ఇద్దరూ జైళ్లకే. ఈ మేరకు ఇప్పటికే పూర్తి మార్గదర్శకాలు విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం. […]

ఆంధ్రప్రదేశ్ : నేటి నుంచే ఇంటికి పింఛన్..
Follow us
Ram Naramaneni

|

Updated on: Feb 01, 2020 | 1:12 PM

ఇప్పటివరకు పింఛన్‌ బ్యాంకు ఖాతాల్లో పడటం, లబ్దిదారులు వెళ్లి పంచాయితీ స్టాఫ్ దగ్గర తెచ్చుకోవడం చూశాం. కానీ ఇకపై ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఎవరికి కమీషన్ ఇవ్వాల్సిన పనిలేదు. ప్రతి నెలా 1వ తేదీన పెన్షన్ మీ ఇంటికే వస్తుంది. ఇటీవల ఏపీ ప్రభుత్వం నియమించిన గ్రామ, వార్డు వాలంటీర్లు ఈ బాధ్యతను నిర్వర్తిస్తారు. వారికి లంచం లాంటివి ఇస్తే..ఇచ్చినవారు, పుచ్చుకున్నవారు ఇద్దరూ జైళ్లకే. ఈ మేరకు ఇప్పటికే పూర్తి మార్గదర్శకాలు విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం. వృద్దులు, వికలాంగులకు ఎటువంటి ఇబ్బందులు పడకుండా పింఛన్ అందుకునేందుకు ప్రభుత్వం ఈ వెసులుబాటు కల్పించింది. ఆంధ్రప్రదేశ్‌లో 54.64 లక్షల లబ్దిదారుల ఇళ్లకు ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలలోపు పెన్షన్ చేరుతుంది. ఎవరికైనా అనివార్య కారణాలు వల్ల పెన్షన్ తీసుకోలేకపోతే.. ఆదివారంలోపు ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఈ రోజు ఉదయం 8 గంటలకు సీఎం జగన్ ప్రారంభించారు.