కోహ్లీ మెచ్చినోడే ఆస్ట్రేలియాకు సరైన మొగుడు.. ఇంగ్లండ్ కోచ్‌గా దింపేయండి..: మాజీ ప్లేయర్
Ravi Shastri Tipped to Replace Brendon McCullum as England Coach: రవిశాస్త్రి ప్రస్తుతం కామెంటరీలో బిజీగా ఉన్నారు. అయితే, ఇంగ్లాండ్ వంటి అగ్రశ్రేణి జట్టు నుంచి ఆఫర్ వస్తే ఆయన అంగీకరిస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ రవిశాస్త్రి ఇంగ్లాండ్ పగ్గాలు చేపడితే, అది అంతర్జాతీయ క్రికెట్లో ఒక సరికొత్త మలుపు కానుంది.

Ravi Shastri Tipped to Replace Brendon McCullum as England Coach: యాషెస్ సిరీస్ 2025-26లో ఇంగ్లాండ్ జట్టు ఘోర పరాజయం పాలవ్వడంతో ఆ జట్టు కోచింగ్ విభాగంలో భారీ మార్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేవలం 11 రోజుల్లోనే మొదటి మూడు టెస్టులు ఓడిపోయి సిరీస్‌ను ఆస్ట్రేలియాకు అప్పగించిన బెన్ స్టోక్స్ సేనపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా హెడ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్ అనుసరిస్తున్న ‘బజ్‌బాల్’ (Bazball) వ్యూహం ఆస్ట్రేలియా గడ్డపై అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఈ నేపథ్యంలో, భారత మాజీ కోచ్ రవిశాస్త్రిని ఇంగ్లాండ్ కోచ్‌గా నియమించాలని ఆ దేశ మాజీ స్పిన్నర్ మోంటీ పనేసర్ డిమాండ్ చేయడం ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది.
బజ్‌బాల్‌కు ముగింపు పలకాలి..
గత రెండేళ్లుగా ఇంగ్లాండ్ జట్టు ఆడుతున్న దూకుడు క్రికెట్ (బజ్‌బాల్) స్వదేశంలో విజయాలను అందించినప్పటికీ, ఆస్ట్రేలియాలోని వేగవంతమైన, బౌన్సీ పిచ్‌లపై మాత్రం తేలిపోయింది. దీనిపై మోంటీ పనేసర్ స్పందిస్తూ.. “బజ్‌బాల్ వ్యూహం ఆస్ట్రేలియాలో పనిచేయదు. మాకు ఇప్పుడు కావాల్సింది ఆస్ట్రేలియాను వారి గడ్డపైనే ఎలా ఓడించాలో తెలిసిన వ్యూహకర్త. ఆ విషయంలో రవిశాస్త్రి కంటే మెరుగైన వ్యక్తి మరొకరు లేరు,” అని పేర్కొన్నారు.
రవిశాస్త్రి ఎందుకు సరైన ఛాయిస్?..
రవిశాస్త్రి టీమ్ ఇండియా కోచ్‌గా ఉన్న సమయంలో భారత్ రెండుసార్లు (2018-19, 2020-21) ఆస్ట్రేలియాలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని గెలుచుకుంది. ఆస్ట్రేలియా జట్టును మానసికంగా, వ్యూహాత్మకంగా ఎలా దెబ్బతీయాలనే దానిపై శాస్త్రికి పూర్తి అవగాహన ఉందని పనేసర్ అభిప్రాయపడ్డారు.
“ఆస్ట్రేలియా బలహీనతలను ఎవరు కనిపెట్టగలరు? వారిని శారీరకంగా, మానసిక ఒత్తిడికి ఎవరు గురిచేయగలరు? అని ఆలోచిస్తే రవిశాస్త్రి పేరు మాత్రమే వినిపిస్తుంది,” అని పనేసర్ వెల్లడించారు.
మెకల్లమ్ భవితవ్యం ప్రశ్నార్థకం..
మరోవైపు, బ్రెండన్ మెకల్లమ్ తన భవిష్యత్తుపై అస్పష్టత వ్యక్తం చేశారు. యాషెస్ ఓటమి తర్వాత ఆయన మాట్లాడుతూ, తన పదవిలో కొనసాగడం అనేది బోర్డు నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని, తాను మాత్రం జట్టులో మార్పులు చేసేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. అయితే, ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) మాత్రం భారీ మార్పుల దిశగా ఆలోచిస్తున్నట్లు సమాచారం.
రవిశాస్త్రి ప్రస్తుతం కామెంటరీలో బిజీగా ఉన్నారు. అయితే, ఇంగ్లాండ్ వంటి అగ్రశ్రేణి జట్టు నుంచి ఆఫర్ వస్తే ఆయన అంగీకరిస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ రవిశాస్త్రి ఇంగ్లాండ్ పగ్గాలు చేపడితే, అది అంతర్జాతీయ క్రికెట్లో ఒక సరికొత్త మలుపు కానుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




