AP Ration: స్టాకిస్టులుగా మారనున్న రేషన్‌ డీలర్లు.. వచ్చే నెల నుంచే ఇంటింటికి రేషన్‌ విధానం..

Ration Dealers As stockist: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 'ఇంటి వద్దకే రేషన్' విధానాన్ని తీసుకురానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ విధానం అందుబాటులోకి రావాల్సి ఉండగా..

AP Ration: స్టాకిస్టులుగా మారనున్న రేషన్‌ డీలర్లు.. వచ్చే నెల నుంచే ఇంటింటికి రేషన్‌ విధానం..
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 13, 2021 | 5:19 AM

Ration Dealers As stockist: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ‘ఇంటి వద్దకే రేషన్’ విధానాన్ని తీసుకురానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ విధానం అందుబాటులోకి రావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఇదిలా ఉంటే ఇంటికే సరుకులను సరఫరా చేస్తుండడంతో ప్రభుత్వం రేషన్‌ డీలర్లను తొలగించనుందని వార్తలు వచ్చాయి. తాజాగా ఈ వార్తలపై పౌర సరఫరాల కమిషనర్‌ కోన శశిధర్‌ క్లారిటీ ఇచ్చారు. రేషన్‌ డీలర్లను తొలగించే ఆలోచన ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న రేషన్‌ డీలర్లంతా స్టాకిస్టులుగా కొనసాగుతారని ఆయన తెలిపారు. డీలర్లకు కమీషన్‌ కూడా ప్రస్తుతం ఉన్న విధానంలోనే వస్తుందని, కొత్తగా పంపిణీలోకి రాబోతున్న వాహనాల డ్రైవర్లు, వలంటీర్లతో కలిసి పనిచేయాలని కోరారు. ఇదిలా ఉంటే.. రేషన్‌ పంపిణీ కోసం తీసుకొచ్చిన వాహనాలను ఈ నెల 20న ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

Also Read: ఆటోకి అతికించిన సత్యసాయి చిత్రపటం నుంచి రాలుతున్న విభూతి.. సాయి మహిమే అంటున్న భక్తులు