AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ఆగమ’ పోస్టుతో ఆగమాగం.. దీక్షితుల వారి కథ కంచికేనా ?

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి గురించిన ప్రస్తావన రాగానే.. ఆ మధ్య అత్యంత వివాదాస్పదుడై.. గత ప్రభుత్వంతో తకరారు పెట్టుకున్న ఆలయ మాజీ ప్రధానార్చకులు రమణ దీక్షితులే గుర్తుకొస్తారు. గత ప్రభుత్వ హయాంలో ఏకంగా ముఖ్యమంత్రితోనే అమీతుమీకి సిద్దపడిన రమణ దీక్షితులు.. ప్రభుత్వం మారిన తర్వాత.. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయినా తర్వాత తిరిగి తన పోస్టుకే వచ్చేస్తారని, ఆనంద నిలయంలో ప్రధాన అర్చక పదవిని చేపడతారని అందరూ భావించారు.  కానీ కథ అడ్డం తిరిగినట్లు క్లియర్‌గా కనిపిస్తోంది. […]

‘ఆగమ’ పోస్టుతో ఆగమాగం.. దీక్షితుల వారి కథ కంచికేనా ?
Rajesh Sharma
| Edited By: |

Updated on: Nov 06, 2019 | 6:24 PM

Share
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి గురించిన ప్రస్తావన రాగానే.. ఆ మధ్య అత్యంత వివాదాస్పదుడై.. గత ప్రభుత్వంతో తకరారు పెట్టుకున్న ఆలయ మాజీ ప్రధానార్చకులు రమణ దీక్షితులే గుర్తుకొస్తారు. గత ప్రభుత్వ హయాంలో ఏకంగా ముఖ్యమంత్రితోనే అమీతుమీకి సిద్దపడిన రమణ దీక్షితులు.. ప్రభుత్వం మారిన తర్వాత.. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయినా తర్వాత తిరిగి తన పోస్టుకే వచ్చేస్తారని, ఆనంద నిలయంలో ప్రధాన అర్చక పదవిని చేపడతారని అందరూ భావించారు.  కానీ కథ అడ్డం తిరిగినట్లు క్లియర్‌గా కనిపిస్తోంది.
ప్రభుత్వం మారిన తర్వాత కొంత కాలం వెయిట్ చేయాలన్న సీఎం జగన్ సూచన మేరకు కొంత కాలం మౌనంగానే వున్నారు రమణ దీక్షితులు. అయితే.. ఆయన తిరిగి ప్రధాన అర్చక పోస్టుకు చేరువవుతున్నారన్న సంకేతాలు పది రోజుల క్రితం ప్రభుత్వం జారీ చేసిన ఓ జీవోతో మళ్ళీ ఊపందుకున్నాయి. వంశపారంపర్యంగా సంతరించే పోస్టులకు పదవీ విరమణ వయస్సు అప్లై కాదన్నది పది రోజుల క్రితం జగన్ సర్కార్ జారీ చేసిన జివో సారాంశం.
దాంతో రమణ దీక్షితులుకు కూడా ఈ జివో వర్తిస్తుందని అనుకున్నారంతా. ఆయన కూడా అదే ఫీలైనట్లు సమాచారం. అయితే.. ప్రభుత్వ జీవోను తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు (టిటిడి) అడాప్ట్ చేసుకుంటేనే రమణ దీక్షితులుకు ప్రధాన అర్చక పదవి తిరిగి లభిస్తుందన్న మెలిక వెలుగులోకి వచ్చింది. అనుకున్నట్లుగానే జీవో జారీ తర్వాత సమావేశమైన టిటిడి ట్రస్టు బోర్డు.. ప్రభుత్వ ఆదేశాన్ని అడాప్ట్ చేసుకుంటూ తీర్మానించింది. ఇక రమణ దీక్షితులుకు లైన్ క్లియర్ అయ్యింది అనుకున్నారు. ఆయన అదేవిధంగా సంతోషించారు.
కానీ.. ముఖ్యమంత్రి అంతరంగం మాత్రం మరోలా వుందని ఆ తర్వాత తెలిసింది. రమణ దీక్షితులుకు ప్రధాన అర్చక పదవి ఇవ్వకూడదంటూ ఆయన వ్యతిరేకులు కూడా పెద్ద స్థాయిలోనే లాబీయింగ్ చేశారు. ఆ లాబీయింగ్ ఫలితంగా అనవసరంగా గొడవను మరింత పెద్దగా చేయడం ఇష్టం లేక.. రమణ దీక్షితులు ఇష్యూని సామరస్య పూర్వకంగా సెటిల్ చేసే బాధ్యతలను టిటిడి అదనపు ఈ.వో. ధర్మారెడ్డికి అప్పగించారు సీఎం జగన్.
ప్రధాన అర్చక పదవి ఇవ్వడం కుదరదని క్లారిటీ ఇస్తూనే.. రమణ దీక్షితులుకు మరో గౌరవ ప్రదమైన పోస్టును ఆఫర్ చేశారు ధర్మారెడ్డి. రమణ దీక్షితులు, ధర్మారెడ్డిని అర్ధరాత్రి కలిసి చర్చించినట్లు ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. టిటిడిలో ఎంతో కొంత గౌరవం దక్కే ‘ఆగమ శాస్త్ర సలహాదారు ’ పదవిని రమణ దీక్షితులుకు ధర్మారెడ్డి జగన్ దూతగా ఆఫర్ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే.. తాను ఆశించింది దక్కకపోవడంతో ఖిన్నుడైన రమణ దీక్షితులు.. తన మద్దతు దారులతో బుధవారం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది.
ప్రధాన అర్చక పోస్టు దక్కితే.. శ్రీవారి ఆస్థానం ఆనంద నిలయానికి తిరిగి హుందాగా వెళ్ళాలని దీక్షితులు భావించారు. ప్రధాన అర్చక హోదాలో ఎలాంటి ఉత్సవాలలోనైనా పెద్దరికం చేయొచ్చు.. ఎలాంటి వాహన సేవలోనైనా స్వామివారి చెంతనే నిలవొచ్చు.. ప్రధాన విగ్రహానికి నిర్వహించే కైంకర్యాలలో ఎప్పుడంటే అప్పుడు పాల్గొనవచ్చు.. అన్నింటికి మించి.. స్వామివారిని నిత్యం స్పృశించే రమణ దీక్షితులు చేతి ఆశీర్వచనం కోసం ఇంటికి వచ్చే విఐపీల నుంచి అత్యంత అరుదైన గౌరవ మర్యాదలు పొందొచ్చు.. ఇవన్నీ కాదని.. ప్రభుత్వం ఆఫర్ చేసిన ఆగమ శాస్త్ర సలహాదారు పోస్టును తీసుకుంటే ఒక్క ఆనంద నిలయం ఎంట్రీ తప్ప దక్కేదేమీ లేదని, గతంలో తాను పొందిన గౌరవ మర్యాదల్లో పదో శాతం కూడా తనకు దక్కవని దీక్షితులు ఇప్పుడు మధనపడుతున్నట్లు సమాచారం.
మరి కోరుకున్న పోస్టు దక్కించుకోవడంలో రమణ దీక్షితులు సక్సెస్ అవుతారో.. లేక చాలా విషయాల్లో ఫర్మ్‌గా వ్యవహరించే జగన్ తీసుకున్న నిర్ణయానికే తలొగ్గుతారో వేచి చూడాలి.