ఈవీఎంలపై దేశవ్యాప్త ఆందోళనకు రెడీ.. రేపు సాయంత్రం దీదీతో రాజ్‌ఠాక్రే భేటీ

  ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈవీఎంలపై పెద్దఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఎన్నికల్లో సందర్భాల్లో ప్రతిపక్ష పార్టీలు రాద్ధంతం చేయడం సర్వసాధారణమే. ఈవీఎంలలో మోసాలు జరిగే అవకాశాలున్నట్టుగా టీడీపీ అధినేత చంద్రబాబు, బెంగాల్ దీదీ కూడా గట్టిగానే వాదించారు. అదే సమయంలో సుప్రీం కోర్టులు ఈవీఎంలపై వేసిన కేసుల్లో అత్యున్నత న్యాయస్థానం కూడా సీరియస్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఈవీఎంలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఆందోళనకు దిగాలని మహారాష్ట్ర నవనిర్మాణ సేన నిర్ణయించింది. ఎన్నికల్లో ఈవీఎలను ఉపయోగించవద్దని, […]

ఈవీఎంలపై దేశవ్యాప్త ఆందోళనకు రెడీ.. రేపు సాయంత్రం దీదీతో రాజ్‌ఠాక్రే భేటీ
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 30, 2019 | 1:57 PM

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈవీఎంలపై పెద్దఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఎన్నికల్లో సందర్భాల్లో ప్రతిపక్ష పార్టీలు రాద్ధంతం చేయడం సర్వసాధారణమే. ఈవీఎంలలో మోసాలు జరిగే అవకాశాలున్నట్టుగా టీడీపీ అధినేత చంద్రబాబు, బెంగాల్ దీదీ కూడా గట్టిగానే వాదించారు. అదే సమయంలో సుప్రీం కోర్టులు ఈవీఎంలపై వేసిన కేసుల్లో అత్యున్నత న్యాయస్థానం కూడా సీరియస్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఈవీఎంలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఆందోళనకు దిగాలని మహారాష్ట్ర నవనిర్మాణ సేన నిర్ణయించింది. ఎన్నికల్లో ఈవీఎలను ఉపయోగించవద్దని, కేవలం బ్యాలెట్ ద్వారానే నిర్వహించాలని పట్టుబట్టింది.

ఈ ఆందోళనలో భాగాంగా పశ్చిమబెంగాల్ సీఎం మహతా బెనర్జీని కలిసేందుకు ఎమ్ఎస్ఎస్ అధినేత రాజ్ థాక్రే రెడీ అవుతున్నారు . ఇదే విషయంపై చర్చించేందుకు ఆయన మంగళవారం సాయంత్రం కోల్‌కతాకు చేరుకోనున్నారు. ఈవీఎంలపై దేశ్యవ్యాప్తంగా వ్యతిరేకతను తీసుకురావడానికి అనుసరించాల్సిన వ్యూహాలను దీదీకి వివరించనున్నారు.ఇప్పటికే కాంగ్రస్‌తో పాటు పలు పార్టీలు ఈవీఎంలను వ్యతిరేకిస్తున్నాయి. ఈవీఎం ట్యాంపరింగ్ జరుగుతుందని బలంగా వాదిస్తున్నాయి.