తెలంగాణ ప్రజలకు అలెర్ట్.. నేడు, రేపు వర్షాలు
తెలంగాణకు వర్ష ముప్పు పొంచి ఉంది. నేడు, రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. దీంతో పంట నూర్పిడి చేసిన రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. తూర్పు బీహార్ నుంచి సౌత్ ఇంటిరియల్ తమిళనాడు వరకు ఆగ్నేయ మధ్యప్రదేశ్, తెలంగాణ, రాయలసీమ మీదుగా 1.5 కి.మీ ఎత్తుల ఉపరితల ద్రోణి ఆవరించి ఉందని.. దీని ఎఫెక్ట్ తో వర్షాలు కురిసే […]

తెలంగాణకు వర్ష ముప్పు పొంచి ఉంది. నేడు, రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. దీంతో పంట నూర్పిడి చేసిన రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
తూర్పు బీహార్ నుంచి సౌత్ ఇంటిరియల్ తమిళనాడు వరకు ఆగ్నేయ మధ్యప్రదేశ్, తెలంగాణ, రాయలసీమ మీదుగా 1.5 కి.మీ ఎత్తుల ఉపరితల ద్రోణి ఆవరించి ఉందని.. దీని ఎఫెక్ట్ తో వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని… వడగండ్లు కూడా పడే అవకాశం ఉందని చెప్పారు. పిడుగులు పడే ఛాన్సస్ ఉండటంతో రైతన్నలు చెట్లకింద ఉండవద్దని సూచించారు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు.