ఏపీలో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు అలెర్ట్..

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. తీవ్ర అల్పపీడన౦గా మారడంతో ఏపీలో రాబోయే మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

ఏపీలో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు అలెర్ట్..
Follow us

|

Updated on: Sep 15, 2020 | 8:32 PM

Rain Alert In AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. తీవ్ర అల్పపీడన౦గా మారడంతో ఏపీలో రాబోయే మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇటు వర్షాలతో వరదలు ముంచెత్తుతున్నాయి. వరదలతో కొన్ని చోట్ల చెరువులకు, రోడ్లకు గండ్లు పడ్డాయి. దీంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న జిల్లాలతో పాటు కృష్ణా, గోదావరి పరివాహాక ప్రాంతాల జిల్లా అధికారులకు ఎప్పటికప్పుడు ప్రభుత్వం సూచనలు చేస్తోంది. ఇటు అధికారులు కూడా వర్షాలు, వరదలతో అప్రమత్తమయ్యారు.

అటు ఉత్తర కోస్తాంధ్ర, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, కర్నూలు, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Also Read:

ఏపీ వాహనదారులకు అలెర్ట్.. లైట్ తీసుకుంటే ఇక అంతే!

బిగ్ బాస్ 4: ఈ సీజన్‌లో ఆమెదే భారీ రెమ్యునరేషన్

‘కరోనా వైరస్‌ను ల్యాబ్‌లో తయారు చేశారు.. ఆధారాలు ఉన్నాయి’

పేద విద్యార్థుల పాలిట దేవుడిగా మారిన సోనూసూద్…

అమెరికాను వణికిస్తున్న కొత్త రకం ‘బ్యాక్టీరియా’.!