‘కరోనా వైరస్‌ను ల్యాబ్‌లో తయారు చేశారు.. ఆధారాలు ఉన్నాయి’

కరోనా వైరస్‌పై రోజుకో విషయం వెలుగులోకి వస్తోంది. వాటిల్లో ఏది నమ్మాలో.! ఏది నమ్మకూడదో.! తెలియక ప్రజలు సతమతమవుతుంటే.. తాజాగా చైనా నుంచి పారిపోయిన ఆ దేశ వైరాలజిస్ట్ లి-మెంగ్ యాన్....

'కరోనా వైరస్‌ను ల్యాబ్‌లో తయారు చేశారు.. ఆధారాలు ఉన్నాయి'
Follow us

|

Updated on: Sep 13, 2020 | 11:58 AM

Chinese Virologist Li Meng-Yan: కరోనా వైరస్‌పై రోజుకో విషయం వెలుగులోకి వస్తోంది. వాటిల్లో ఏది నమ్మాలో.! ఏది నమ్మకూడదో.! తెలియక ప్రజలు సతమతమవుతుంటే.. తాజాగా చైనా నుంచి పారిపోయిన ఆ దేశ వైరాలజిస్ట్ లి-మెంగ్ యాన్ కరోనా వైరస్‌ను ల్యాబ్‌లోనే తయారు చేశారని అంటున్నారు. తన దగ్గర ఆధారాలు ఉన్నాయని.. వాటిని త్వరలోనే బయటపెడతానని తెలిపారు.

బ్రిటన్‌కు చెందిన లూస్ వుమన్ టాక్ షోలో మాట్లాడిన లీ.. కరోనా విషయం చైనా, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)కు ముందే తెలుసని.. రెండు విభిన్న వైరస్‌లను కలిపి కరోనాను ఎప్పుడో సృష్టించారని, ప్రజలకు మాత్రం గతేడాది పరిచయం చేశారని ఆమె అన్నారు. కరోనా వైరస్ సింథటిక్ (Synthetic) అని చెప్పిన ఆమె.. సైంటిస్టులు కాని వారు కూడా దాన్ని గుర్తించగలరని స్పష్టం చేశారు.

”కరోనా వైరస్ వుహాన్‌లోని ల్యాబ్ నుంచి వచ్చింది. ఇది వరకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఫ్రాన్స్‌కి చెందిన ఓ వైరాలజీ నిపుణుడు కూడా… వుహాన్ ల్యాబ్ నుంచే వైరస్ పుట్టిందని ఆరోపించారు. వైరస్ జన్యుపటం… మన వేలి ముద్రలలాగే ఉంటుంది. ఎవరైనా దాన్ని గుర్తించగలరు. దాన్ని ఆధారంగా చేసుకునే వైరస్ ల్యాబ్‌లో సృష్టించిందని ప్రజలు వివరిస్తా” అని లీ అన్నారు.

గతేడాది తాను హాంకాంగ్ వచ్చేశానన్న లి-మెంగ్ యాన్… చైనా కనుసన్నల్లో నడిచే హాంకాంగ్ అధికారుల నుంచి తనకు ప్రమాదం పొంచి ఉందని… ఆన్‌లైన్ వీడియో కాన్ఫరెన్స్ ఇంటర్వ్యూలో తెలిపారు. తాను ఓ రహస్య ప్రదేశంలో ఉన్నానన్న ఆమె… తన బయోడేటా మొత్తం చైనా ప్రభుత్వం డిలీట్ చేసిందని తెలిపారు. వుహాన్‌లోని వెట్ మార్కెట్ నుంచి కరోనా వైరస్ వచ్చిందనే చైనా ప్రభుత్వ వాదన పచ్చి బూటకం అన్న లీ… వైరస్‌ని మనుషులే తయారుచేశారని తాను ఆధారాలతో రిపోర్ట్ పబ్లిష్ చేస్తానని అన్నారు. ఓ సైంటిస్టుగా తాను… నీతి నిజాయితీలకు కట్టుబడి ఉన్నానన్నారు. చైనా కవరప్ కుట్రను బయటపెడతానని టాక్ షోకి ఇచ్చిన ఇంటర్వ్యూలో లి-మెంగ్ యాన్ వెల్లడించారు.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..