IRCTC: మీరు ట్రైన్‌లో ప్రయాణిస్తుంటారా? ఇది ఏ రైలో చెప్పుకోండి.. రైల్వే మంత్రి ఓపెన్ ఛాలెంజ్..

రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటారు. రైల్వే శాఖకు సంబంధించి ప్రతి అప్‌డేట్‌ను సోషల్ మీడియాలో పంచుకుంటూ.. ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేస్తారు. అదే సమయంలో కొన్ని కొన్ని మాంచి ఫోటోలు షేర్ చేస్తుంటారు. మరికొన్నిసార్లు ఇండియన్ రైల్వేస్‌కు సంబంధించి ప్రశ్నలు సంధిస్తూ ప్రజలకు సవాల్ విసురుతారు.

IRCTC: మీరు ట్రైన్‌లో ప్రయాణిస్తుంటారా? ఇది ఏ రైలో చెప్పుకోండి.. రైల్వే మంత్రి ఓపెన్ ఛాలెంజ్..
Indian Railways
Follow us

|

Updated on: Jun 01, 2023 | 6:33 AM

రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటారు. రైల్వే శాఖకు సంబంధించి ప్రతి అప్‌డేట్‌ను సోషల్ మీడియాలో పంచుకుంటూ.. ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేస్తారు. అదే సమయంలో కొన్ని కొన్ని మాంచి ఫోటోలు షేర్ చేస్తుంటారు. మరికొన్నిసార్లు ఇండియన్ రైల్వేస్‌కు సంబంధించి ప్రశ్నలు సంధిస్తూ ప్రజలకు సవాల్ విసురుతారు. తాజాగా అలాంటి సవాల్‌నే విసిరారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. ఓ రైలు బోగి లోపలి భాగం ఫోటోను షేర్ చేసిన ఆయన.. ‘ఇది ఏ రైలో చెప్పుకోండి చూద్దాం’ అంటూ నెటిజన్లకు ఛాలెంజ్ విసిరారు. ఈ రైలును కనిపెట్టేందుకు ఆయన ఒక హింట్ కూడా ఇచ్చారండోయ్. ‘జాక్ ఎన్ జిల్ వెంట్ అప్ ది హిల్’ అంటూ చిన్న క్లూ కూడా ఇచ్చేశారు. దాన్ని బట్టి కొందరు ఆ ఛాలెంజ్‌కు ఆన్సర్ చేసేశారు.

అశ్విని వైష్ణవ్ ట్వీట్‌లో.. ‘తయారీలో ఉన్న ఈ రైలు ఏదో కనిపెట్టండి? హింట్: జాక్ ఎన్ జిల్ వెంట్ అప్ ది హిల్’ అంటూ ట్రైన్ బోగి ఫోటోతో పాటు క్యాప్షన్ పెట్టారు. ఇక ఆయన పోస్ట్ చేసిన ఫొటోలోని రైలు బోగీలో ఇరువైపులా సింగిల్ సీట్స్, విశాలమైన కిటికీలు, టాప్ అంతా గ్లాస్‌తో తయారు చేయబడి ఉంది. ఆయన ఇచ్చిన హింట్, ఆ ట్రైన్ బోగీని బట్టి కొందరు యూజర్లు.. ఇది కల్కా-సిమ్లా మార్గంలో త్వరలో చక్కర్లు కొట్టనున్న కొత్త టాయ్ ట్రెయిన్‌కు సంబంధించిన బోగి అని బదులిచ్చేస్తున్నారు. ఇలా ఒక్కొక్కరు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు.

ఇవి కూడా చదవండి

రైలు కథ ఇదీ..

కపుర్తలలోని రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఇటీవల కల్కా-సిమ్లా హెరిటేజ్ ట్రాక్ కోసం నాలుగు అడ్వాన్స్‌డ్ విస్టాడోమ్ నేరో గేజ్ కోచ్‌లను విడుదల చేసింది. ఇవి ఇంటీరియర్ డిజైన్ అంతా చాలా క్లాస్‌గా ఉంది. పర్వత ప్రాంతాల్లో ప్రయాణించే ఈ రైల్లలో బయటి దృశ్యాలను చూసేందుకు.. విశాలమైన కిటికీలు ఉన్నాయి. అలాగే వీటి పై కప్పును గాజు అద్దాలతో నిర్మించారు. ఇకపోతే.. సోమవారం నాడు కల్కా-సిమ్లా మార్గంలో ఈ బోగీల ట్రయల్ నిర్వహించనున్నారు. ట్రయల్ రన్ విజయవంతమైన తర్వాత ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఈ ట్రైన్‌లో 12 సీట్లతో ఒక ఏసీ ఎగ్జిక్యూటివ్ కార్, 24 సీట్లతో ఒక ఏసీ చైర్ కార్, 30 సీట్లతో ఒక నాన్ ఏసీ చైర్ కార్, పవర్-కమ్-లగేజ్, గార్డ్ కార్ ఒకటి ఉంటాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..