రైల్వే ప్రయాణీకులకు తీపికబురు…

దేశంలో మరో 80 రైళ్లు నడపనున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. సెప్టెంబర్ 12 నుంచి ఈ రైళ్లు నడుస్తాయని.. ఈ నెల 10 నుంచి ఈ రైళ్లకు రిజర్వేషన్ చేసుకునే..

  • Ravi Kiran
  • Publish Date - 4:49 pm, Sat, 5 September 20
రైల్వే ప్రయాణీకులకు తీపికబురు...

special trains 80 to start from Sept 12: అన్‌లాక్ 4.0 నేపథ్యంలో రైల్వే శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణీకుల సౌకర్యార్ధం దేశవ్యాప్తంగా మరో 80 రైళ్లను నడిపేందుకు సిద్ధమైంది. సెప్టెంబర్ 12వ తేదీ నుంచి ఈ రైళ్లు నడవనుండగా.. ఈ నెల 10 నుంచి వీటికి రిజర్వేషన్ చేసుకునే సౌకర్యం అందుబాటులోకి వస్తుందని రైల్వే బోర్డు చైర్మన్ వినోద్ కుమార్ తెలిపారు.

రైళ్లకు ఎక్కువ డిమాండ్ ఉన్న ప్రాంతాలు, వెయిటింగ్  లిస్టు ఎక్కువగా ఉండే చోట్లలో ఈ రైళ్లు నడుస్తాయన్నారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు కోరితే పరీక్షలకు రైళ్లు నడిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. అలాగే మరికొద్ది రోజుల్లో ఇంకొన్ని రైళ్లు నడపడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. కాగా, బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ ప్రక్రియ కొనసాగుతోందని.. కరోనా కారణంగా కాస్త జాప్యం ఏర్పడిందన్నారు.