రాధికా ‘వెరైటీ కౌన్‌ బనేగా కరోడ్‌పతి’..! వివరాలివే..!

కౌన్ బనేగా కరోడ్‌పతి.. ఈ షో గుర్తుంది కదా..! బాలీవుడ్‌లో.. అమితాబ్ హోస్ట్‌గా వ్యవహరించిన ఈ షో.. ఇండియాలోనే బిగ్గెస్ట్ రేటింగ్‌తో దూసుకెళ్లింది. ఇది బాగా పాపులర్ అవడంతో.. అనంతరం ఈ షోను వివిధ భాషల్లోనూ తీసుకొచ్చారు. తెలుగులో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున ఈ షోకి వ్యాఖ్యతలుగా వ్యవహరించగా.. తమిళంలో ‘నీంగలుమ్ వెల్లాలుమ్’ ఒరు కోడి’ పేరుతో..  సూర్య, ప్రకాష్ రాజ్, అరవింద్‌ స్వామిలు ఒక్కో సీజన్‌లో హోస్టులుగా వ్యవహరించారు. కాగా.. […]

రాధికా 'వెరైటీ కౌన్‌ బనేగా కరోడ్‌పతి'..! వివరాలివే..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Nov 13, 2019 | 3:02 PM

కౌన్ బనేగా కరోడ్‌పతి.. ఈ షో గుర్తుంది కదా..! బాలీవుడ్‌లో.. అమితాబ్ హోస్ట్‌గా వ్యవహరించిన ఈ షో.. ఇండియాలోనే బిగ్గెస్ట్ రేటింగ్‌తో దూసుకెళ్లింది. ఇది బాగా పాపులర్ అవడంతో.. అనంతరం ఈ షోను వివిధ భాషల్లోనూ తీసుకొచ్చారు. తెలుగులో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున ఈ షోకి వ్యాఖ్యతలుగా వ్యవహరించగా.. తమిళంలో ‘నీంగలుమ్ వెల్లాలుమ్’ ఒరు కోడి’ పేరుతో..  సూర్య, ప్రకాష్ రాజ్, అరవింద్‌ స్వామిలు ఒక్కో సీజన్‌లో హోస్టులుగా వ్యవహరించారు.

కాగా.. ఇప్పుడు ఈ షోకు.. సినీనటి రాధికకు లింక్ ఏంటని అనుకుంటున్నారా..? అసమాన నటిగా పేరు తెచ్చుకున్న రాధిక ఈషోకు హోస్ట్‌గా వ్యవహరించబోతున్నారు. కోటీశ్వరుడు మాదిరిగా.. తమిళంలో ‘కోడీశ్వరి’ అనే గేమ్‌ షోను ప్లాన్ చేశారు. ఈ క్విజ్ షోకు రాధిక హోస్ట్‌గా వ్యవహరిస్తుండగా.. ఇందులో కేవలం మహిళలు మాత్రమే పార్టిసిపేట్ చేయనున్నారు. పలు టీవీ సీరియల్స్‌లో నటించిన రాధికా తొలిసారి హోస్ట్‌గా దర్శనమివ్వనున్నారు. కలర్స్‌ టీవీ ఛానెల్‌లో ఈ షో ప్రసారం కానుంది. డిసెంబర్‌లో ఈ షో ప్రారంభం కానున్నట్టు సమాచారం. అయితే.. ఈ షో టైమింగ్స్ ఇంకా డిసైడ్ చేయలేదు.

ఈ సందర్భంగా.. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్.. రాధికకు ఓ వీడియో రికార్డ్ చేసి పంపారు. ఆ వీడియోలో.. మొదటిసారిగా.. ఈ షోకు ఓ లేడీ సూపర్ స్టార్ హోస్ట్‌గా వ్యవహరించడం.. కేబీసీ చరిత్రలో సువర్ణ అధ్యాయం.. అందులోనూ.. ఓన్లీ ఫీమేల్స్ కోసమే ఈ షో ఉండటం గమనించదగ్గ విషయం. మీ కెరీర్‌లో ఎంత ఉన్నత స్థానం సంపాదించారో.. ఇందులో కూడా మంచి పేరు సాధించాలని కోరుకుంటూ.. రాధికకు ఆల్‌దిబెస్ట్ చెప్పారు అమితాబ్.