మరో కొత్త అవతారం ఎత్తనున్న పూరి జగన్నాథ్.. పూరీతో సరికొత్త టాక్ షో ప్లాన్ చేస్తోన్న ప్రముఖ మీడియా సంస్థ.?

పూరి జగన్నాథ్ ఇప్పుడు మరో కొత్త అవతారం ఎత్తునున్నట్లు తెలుస్తోంది. ఒక న్యూస్ ఛానల్ కోసం పూరి ఓ టాక్ షో చేయనున్నట్లు సమాచారం. ఈ షోకు ‘పుడమి’ అనే టైటిల్ పెట్టనున్నారని టాక్.

మరో కొత్త అవతారం ఎత్తనున్న పూరి జగన్నాథ్.. పూరీతో సరికొత్త టాక్ షో ప్లాన్ చేస్తోన్న ప్రముఖ మీడియా సంస్థ.?

puri jagannadh planing for talk show: టాలీవుడ్ అగ్ర దర్శకుల్లో పూరీజగన్నాథ్ ఒకరు. అత్యంత తక్కువ సమయంలో సినిమాలు తెరకెక్కిస్తూ భారీ విజయాలను అందుకోవడం ఒక్క పూరికే చెందుతుందని ఆయన అభిమానులు చెబుతుంటారు. పూరీ జగన్నాథ్ కేవలం దర్శకుడిగానే కాకుండా అప్పుడప్పుడు సిల్వర్ స్క్రీన్‌పై కూడా కనిపించాడు. ఇక కొన్ని సినిమాల్లో తన గొంతును సవరించుకొని గాయకుడిగా కూడా మారాడు.
ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం పూరి జగన్నాథ్ ఇప్పుడు మరో కొత్త అవతారం ఎత్తునున్నట్లు తెలుస్తోంది. ఒక న్యూస్ ఛానల్ కోసం పూరి ఓ టాక్ షో చేయనున్నట్లు సమాచారం. ఈ షోకు ‘పుడమి’ అనే టైటిల్ పెట్టనున్నారని టాక్. నేషనల్ ఛానళ్లలో పాపులర్ అయిన ఒక షో మాదిరిగా ఈ టాక్ షో ఉండనుందని ఓ వార్త హల్‌చల్ చేస్తోంది. ఇక పూరీ జగన్నాథ్ ఇప్పటికే ‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పలు అంశాలపై యూట్యూబ్ వేదికగా తన అభిప్రాయాలను పంచుకుంటున్న విషయం తెలిసిందే. ఈ వీడియోల ఆధారంగానే ఈ కొత్త టాక్ షోను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.