చంద్రబాబుపై వదినగారి విసుర్లు..ఏమన్నారంటే?
ఏపీ రాజధానిని అమరావతి నుంచి తరలించవద్దని కోరుతున్న రైతుల బృందం బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరిని కలిశారు. తమ ఆవేదనను ఆమెకు వివరించారు. రాజధాని మార్పును నిలిపేసేలా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని ఒప్పంచాలని అభ్యర్థించారు. అయితే.. ఆ సందర్భంగా పురంధేశ్వరి కామెంట్లు ఆసక్తి రేపుతున్నాయి. అభివృద్ధి వికేంద్రీకరణను బీజేపీ మొదటి నుంచి సమర్థిస్తోందని అన్నారు పురంధేశ్వరి. రైతులు తమ భూములన ఏ ఒక్క రాజకీయ పార్టీకి ఇవ్వలేదన్నారామె. రైతులు భూములిచ్చింది ప్రభుత్వానికి కాబట్టి అధికారంలో […]
ఏపీ రాజధానిని అమరావతి నుంచి తరలించవద్దని కోరుతున్న రైతుల బృందం బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరిని కలిశారు. తమ ఆవేదనను ఆమెకు వివరించారు. రాజధాని మార్పును నిలిపేసేలా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని ఒప్పంచాలని అభ్యర్థించారు. అయితే.. ఆ సందర్భంగా పురంధేశ్వరి కామెంట్లు ఆసక్తి రేపుతున్నాయి.
అభివృద్ధి వికేంద్రీకరణను బీజేపీ మొదటి నుంచి సమర్థిస్తోందని అన్నారు పురంధేశ్వరి. రైతులు తమ భూములన ఏ ఒక్క రాజకీయ పార్టీకి ఇవ్వలేదన్నారామె. రైతులు భూములిచ్చింది ప్రభుత్వానికి కాబట్టి అధికారంలో ఎవరున్నా ముందుగా భూములిచ్చిన రైతులకు సమాధానం చెప్పాలని పురంధేశ్వరి అభిప్రాయపడ్డారు. రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 2500 కోట్ల రూపాయల నిధులిస్తే చంద్రబాబు వాటితో గ్రాఫిక్స్ చేయించి చూపారని, చిత్తశుద్దితో రాజధాని నిర్మాణానికి ఆయన పని చేయలేదని ఆరోపించారు.
జిఎన్ రావు కమిటీ నివేదికను బహిర్గతం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. జగన్ ప్రభుత్వం రాజధాని ప్రాంత రైతులకు ఏం చెబుతుందో చూసిన తర్వాత బిజెపి స్పందిస్తుందని చెప్పారు పురంధేశ్వరి. ప్రతిపక్ష నేతగా వున్నప్పుడు జగన్ అమరావతిలో రాజధాని ఏర్పాటును సమర్థించారని, అప్పుడు ఈ మూడు రాజధానుల ఫార్ములా ఎందుకు చెప్పలేదని పురంధేశ్వరి ప్రశ్నించారు.