ఆగస్టు 22న బెంగళూరులో మాంసం విక్రయాలపై నిషేధం
కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరు మున్సిపల్ కార్పోరేషన్ గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని కీలక నిర్ణయం తీసుకుంది. వినాయక చతుర్థి సందర్భంగా ఆగస్టు 22వతేదీన బెంగళూరు నగరంలో మాంసం విక్రయాలను నిషేధిస్తున్నట్లు బృహత్ బెంగళూరు మహానగర పాలిక (బీబీఎంపీ) ప్రకటించింది.

కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరు మున్సిపల్ కార్పోరేషన్ గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని కీలక నిర్ణయం తీసుకుంది. వినాయక చతుర్థి సందర్భంగా ఆగస్టు 22వతేదీన బెంగళూరు నగరంలో మాంసం విక్రయాలను నిషేధిస్తున్నట్లు బృహత్ బెంగళూరు మహానగర పాలిక (బీబీఎంపీ) ప్రకటించింది. పౌర సమాజం వినతిపై మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. వినాయక చవితి పండగ సందర్భంగా 22వతేదీన బెంగళూరు నగరంలో అన్ని మాంసం దుకాణాలను మూసివేస్తున్నట్లు బీబీఎంపీ వెల్లడించింది. కరోనా సంక్షభం నేపథ్యంలో ఎక్కువ మంది గుమిగూడకుండా సామాజిక దూరం పాటిస్తూ వినాయక చవితి ఉత్సవాలు జరుపుకునేందుకు కర్ణాటక సర్కారు అనుమతించింది. ఆగస్టు 31వతేదీ వరకు మతపరమైన ఉత్సవాల విషయంలో కేంద్రం ఆంక్షలు విధించిన నేపథ్యంలో కర్ణాటకలో ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇక, జనం సమీకరణ లేకుండా సామూహికంగా కాకుండా విడివిడిగా పండగలు చేసుకోవాలని సర్కారు సూచించింది.
