కోచ్‌గా తీసేశారని.. ప్రతీకారానికి పాల్పడ్డాడు
మంచి ఆటగాళ్లను తీర్చిదిద్దాల్సిన కోచ్.. ఆటగాళ్ల వస్తువులనే దొంగతనం చేశాడు. ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. బాధ్యతల నుంచి తప్పించినందుకు ప్రతీకారంగా ఈ పనికి పూనుకున్న శేఖర్ పథక్ అనే మాజీ ఫుట్‌బాల్ కోచ్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.
కోచ్ గాబాధ్యతలు చేపట్టాడు.. విధులకు సక్రమంగా హాజరు కావడంలేదని తొలగించారు. దీంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. తనను ఈ స్థితికి తీసుకువచ్చినవారపై కక్ష కట్టాడు. ఎలాగైనా ప్రతికారం తీర్చుకోవాలనుకున్నాడు. మంచి ఆటగాళ్లను తీర్చిదిద్దాల్సిన కోచ్.. ఆటగాళ్ల వస్తువులనే దొంగతనం చేశాడు. ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. బాధ్యతల నుంచి తప్పించినందుకు ప్రతీకారంగా ఈ పనికి పూనుకున్న శేఖర్ పథక్ అనే మాజీ ఫుట్‌బాల్ కోచ్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.
ఢిల్లీకి చెందిన శేఖర్ పథక్‌ను 2011లో దేశ రాజధానిలోని జవహర్‌లాల్ స్టేడియంలో ఫుట్‌బాల్ కోచ్‌గా నియమితులయ్యారు. అయితే, విధులకు సరిగ్గా హాజరుకాకపోవడంతో అతనిని 2013లో సస్పెండ్ చేశారు. దీంతో స్వంత కోచింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేసుకుని కొన్నాళ్లు నడిపినా, అది అంతగా నడవకపోవడంతో మూతపడింది. ఆతర్వాత శేఖర్‌ను ఆర్థిక ఇబ్బందులు వెంటాడాయి. దీంతో ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో మేనేజర్‌గా పనిచేశాడు.
ఇదిలావుంటే, ఈ ఏడాది మార్చి 13న జవహర్‌లాల్ స్టేడియంలో జరుగుతున్న లీగ్ మ్యాచ్‌లో పాల్గొన్న ఢిల్లీ యునైటెడ్ ఫుట్‌బాల్ క్లబ్ ఆటగాళ్లు ఫోన్లు, ఇతర వస్తువులను డ్రెస్సింగ్ రూంలోని క్యాబిన్లలో పెట్టుకున్నారు. మ్యాచ్ అనంతరం తిరిగివచ్చిన ఆటగాళ్లు తమ వస్తువులు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసు విచారణ చేపట్టిన పోలీసులు.. ఆ ఫోన్లను ఎవరు వాడుతున్నారని నిఘా పెట్టారు. ఓ వ్యక్తి వాటిని వాడుతున్నాడని గుర్తించి, ఫోన్ లొకేషన్ ఆధారంగా ఆ వ్యక్తిని పట్టుకున్నారు. అతను ఇచ్చిన సమాచారం మేరకు మాజీ కోచ్ ఇంట్లో సోదా నిర్వహించగా, ఆటగాళ్లకు చెందిన తొమ్మిది ఫోన్లు దొరికినట్లు పోలీసులు తెలిపారు. మంచి ఆటగాడు, కోచ్‌నైన తనను విధుల నుంచి తప్పించినందుకు అసహనానికి గురై ఇలా చేసినట్టు శేఖర్ పథక్ విచారణ సందర్భంగా అంగీకరించారు. తనను విధుల నుంచి తీసివేసి, కొత్త కోచ్‌ను నియమించారన్న అక్కసుతో అతను ఈ పనికి పాల్పడ్డట్లు పోలీసులు వెల్లడించారు.