దేశాభివృద్ధి మొత్తం కుంటుపడింది: ప్రధాని మోదీ పాలనపై ప్రియాంక ట్వీట్
ప్రధాని మోదీ వంద రోజుల పాలనపై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ట్వీట్టర్‌లో తీవ్రస్ధాయిలో విమర్శలు చేశారు. మోదీ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత దేశంలో వందలాది పరిశ్రమలు మూతపడ్డాయని, మొత్తం దేశంలో పాలన కుంటుపడిందని ఆరోపించారు. బీజేపీ పాలనలో దేశాభివృద్ధి మొత్తం కుంటుపడిందన్నారు ప్రియాంక. ఆటోమొబైల్, రవాణా, మైనింగ్ రంగాలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని, వాటని బయటపడేసేందుకు తగిన చర్యలు తీసుకోకుండా వేడుకలు చేసుకోడానికి సిద్ధపడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు వందరోజుల పాలనపై పండగ […]
ప్రధాని మోదీ వంద రోజుల పాలనపై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ట్వీట్టర్‌లో తీవ్రస్ధాయిలో విమర్శలు చేశారు. మోదీ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత దేశంలో వందలాది పరిశ్రమలు మూతపడ్డాయని, మొత్తం దేశంలో పాలన కుంటుపడిందని ఆరోపించారు. బీజేపీ పాలనలో దేశాభివృద్ధి మొత్తం కుంటుపడిందన్నారు ప్రియాంక. ఆటోమొబైల్, రవాణా, మైనింగ్ రంగాలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని, వాటని బయటపడేసేందుకు తగిన చర్యలు తీసుకోకుండా వేడుకలు చేసుకోడానికి సిద్ధపడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు వందరోజుల పాలనపై పండగ చేసుకుంటే అవి పైన తెలిపిన రంగాల పరిశ్రమలు వాటి నాశనంగా భావిస్తాయంటూ ఘాటుగా విమర్శించారు. ఆయా రంగాలు ఎదుర్కొంటున్న సంక్షోభానికి సంబంధించి మీడియాలో వచ్చిన కథనాలను ప్రియాంక ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.