గవర్నర్ నరసింహన్ ఆల్ టైమ్ రికార్డ్… 12 ఏళ్ల పాటు…!

తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ ఈఎస్ఎల్‌ నరసింహన్ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. దేశంలో అందరికంటే ఎక్కువకాలం గవర్నర్‌గా పనిచేసిన రికార్డును నెలకొల్పారు. ప్రగతి భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌కు రాష్ట్ర ప్రభుత్వం వీడ్కోలు పలికింది. తెలంగాణకు కొత్త గవర్నర్ నియామకం కావడంతో నరసింహన్ ఇవాళ ప్రత్యేక విమానంలో బెంగళూరు వెళ్లిపోయారు. బేగంపేట విమానాశ్రయంలో నరసింహన్ దంపతులకు తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు, అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు. అయితే, తెలంగాణ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ రికార్డు బద్దలు […]

గవర్నర్ నరసింహన్ ఆల్ టైమ్ రికార్డ్... 12 ఏళ్ల పాటు...!
Follow us

| Edited By:

Updated on: Sep 07, 2019 | 9:03 PM

తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ ఈఎస్ఎల్‌ నరసింహన్ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. దేశంలో అందరికంటే ఎక్కువకాలం గవర్నర్‌గా పనిచేసిన రికార్డును నెలకొల్పారు. ప్రగతి భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌కు రాష్ట్ర ప్రభుత్వం వీడ్కోలు పలికింది. తెలంగాణకు కొత్త గవర్నర్ నియామకం కావడంతో నరసింహన్ ఇవాళ ప్రత్యేక విమానంలో బెంగళూరు వెళ్లిపోయారు. బేగంపేట విమానాశ్రయంలో నరసింహన్ దంపతులకు తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు, అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు.

అయితే, తెలంగాణ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ రికార్డు బద్దలు కొట్టారు. దేశంలో అందరికంటే ఎక్కువకాలం గవర్నర్‌గా పనిచేసిన రికార్డును నెలకొల్పారు. ఆ రకంగా ఆలిండియా టాపర్‌గా నిలిచారు. 2007వ సంవత్సరం నుంచి 2019 వరకు అంటే, పుష్కరకాలం పాటు గవర్నర్‌గా పనిచేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. 2009 డిసెంబర్ 27న తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్న సమయంలో ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా నియమితులయ్యారు. అప్పటి నుంచి ఏపీకి కొత్త గవర్నర్ వచ్చే వరకు రెండు రాష్ట్రాలకు ఆయనే గవర్నర్‌గా కొనసాగారు. ఆ తర్వాత తెలంగాణ గవర్నర్‌గా కొనసాగారు. ఆంధ్రప్రదేశ్‌కు రాకముందు ఆయన తొలిసారిగా ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా సేవలు అందించారు. 2007 జనవరి 25 నుంచి 2009 డిసెంబర్ 27 వరకు, అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా నియమితులు అయ్యే వరకు ఆయన ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా పనిచేశారు.

ఎక్కువకాలం గవర్నర్‌గా పదవీ బాధ్యతలు నిర్వర్తించిన ఘనతతో పాటు మరో కేటగిరీలో ఆయన రెండో స్థానంలో నిలిచారు. గతంలో స్వాతంత్ర్య ఉద్యమకారిణి సరోజినీ నాయుడు కుమార్తె పద్మజానాయుడు 1956 నవంబరు 3 నుంచి 1967 జూన్‌ 1 వరకు (10 సంవత్సరాల 209 రోజులు) ఒకేచోట పనిచేశారు. నరసింహన్ రెండో స్థానంలో (9 సంవత్సరాల ఎనిమిది నెలలు) ఉన్నారు.

యూపీఏ హయాంలో నియామకమై ఎన్డీయేలో కూడా పూర్తికాలం కొనసాగిన ఒకే ఒక్క గవర్నర్‌గా కూడా నరసింహన్ రికార్డు నెలకొల్పారు. యూపీఏ కాలంలో నియమితులైన గవర్నర్లు అందరూ స్థానభ్రంశం చెందారు. కానీ, నరసింహన్ ఒక్కరే ఎన్డీయే హయాంలో కూడా ఐదేళ్లపాటు కంటిన్యూ కాగలిగారు. తాజాగా తమిళనాడకు చెందిన బీజేపీ నేత తమిళిసై సౌందర్‌రాజన్ తెలంగాణ గవర్నర్‌గా నియమితురాలు కావడంతో ఆయన పదవీకాలం ముగిసింది. సెప్టెంబర్ 8న తెలంగాణ గవర్నర్‌గా తమిళిసై సౌందర్ రాజన్ ప్రమాణస్వీకారం చేస్తారు.

Latest Articles