‘ మహా ‘ ఎపిసోడ్ : జైపూర్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు రాచభోగాలు

  మహారాష్ట్రలో తలెత్తిన ‘ రాజకీయ సంక్షోభం ‘ ఆ రాష్ట్రం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా ఎన్నికైనవారికి వరంగా మారింది. వారిని బీజేపీ, ఇతర పార్టీలు ‘ ఎగరేసుకుపోకుండా ‘ చూసేందుకు పార్టీ నాయకత్వం రాజస్థాన్.. జైపూర్ లోని ఓ ఫైవ్ స్టార్ రిసార్టుకు తరలించింది. (నిధుల కొరతతో అల్లల్లాడుతున్న రాజస్థాన్ లోని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ ఎమ్మెల్యేల ‘ భోగాల ‘ సంగతి పట్టనట్టు ఉంది). జైపూర్ లోని లగ్జరియస్ రిసార్ట్ లో ఈ శాసన […]

' మహా ' ఎపిసోడ్ : జైపూర్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు రాచభోగాలు
Follow us
Pardhasaradhi Peri

|

Updated on: Nov 11, 2019 | 4:22 PM

మహారాష్ట్రలో తలెత్తిన ‘ రాజకీయ సంక్షోభం ‘ ఆ రాష్ట్రం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా ఎన్నికైనవారికి వరంగా మారింది. వారిని బీజేపీ, ఇతర పార్టీలు ‘ ఎగరేసుకుపోకుండా ‘ చూసేందుకు పార్టీ నాయకత్వం రాజస్థాన్.. జైపూర్ లోని ఓ ఫైవ్ స్టార్ రిసార్టుకు తరలించింది. (నిధుల కొరతతో అల్లల్లాడుతున్న రాజస్థాన్ లోని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ ఎమ్మెల్యేల ‘ భోగాల ‘ సంగతి పట్టనట్టు ఉంది). జైపూర్ లోని లగ్జరియస్ రిసార్ట్ లో ఈ శాసన సభ్యులు సుమారు మూడు రోజులుగా కనీవినీ ‘ అతిథి మర్యాదలు ‘ పొందుతున్నారు.

జైపూర్-ఢిల్లీ హైవేకి 1.5 కి. మీ, దూరంలో ఉన్న ఈ బ్రహ్మాండమైన అతిథి గృహంలో గది అద్దె రోజుకు రూ. 1.2 లక్షలట. ప్రతి విల్లాకు ప్రత్యేక స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి. బార్లు, స్పా.. ఒకటేమిటి ?ఉండాల్సిన హంగులన్నీ ఇందులో ఉన్నాయని తెలుస్తోంది. ఇందులో ఈ ఎమ్మెల్యేలతో పృథ్వీ రాజ్ చవాన్, అశోక్ చవాన్, మల్లిఖార్జున ఖర్గే, అశోక్ గెహ్లాట్ వంటి పార్టీ సీనియర్ నేతలు సమావేశాలు జరుపుతున్నారు. ఇక ఈ శాసన సభ్యులు ఎక్కడికి వెళ్లినా వీరి వెంట పోలీసు బలగాలు ఉంటున్నాయి. వీరు రాష్ట్రంలోని ఏ టూరిస్టు స్పాట్ కు వెళ్లినా ఆ ఖాకీలూ వెన్నంటి ఉండాల్సిందే.. ఒక విధంగా చెప్పాలంటే వీరి మీద ఈగ కూడా వాలకుండా చూస్తున్నారు.