ఇంగ్లీష్‌పై ముందడుగే.. మడమతిప్పేది లేదన్న జగన్

నాలుగేళ్ళలో ఏపీవ్యాప్తంగా పదో తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంలోనే విద్యాబోధన జరిగేలా చర్యలు తీసుకోవడం ఖాయమని కుండ బద్దలు కొట్టారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. జాతీయ స్థాయిలో ఏపీ విద్యార్థులు ధీటుగా కాంపిటిటివ్ పరీక్షలు సన్నద్దం కావాలంటే ఇంగ్లీష్ మీడియంలో బోధన తప్పనిసరి అని తేల్చి చెప్పారు. ఈ దిశగా ఏపీ విద్యార్థులను అన్ని అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవడంలో వెనక్కి తగ్గేది లేదని ఆయనన్నారు. రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం వ్యతిరేకించేవారిపై ఘాటు […]

ఇంగ్లీష్‌పై ముందడుగే.. మడమతిప్పేది లేదన్న జగన్
Follow us
Rajesh Sharma

| Edited By: Srinu

Updated on: Nov 11, 2019 | 5:08 PM

నాలుగేళ్ళలో ఏపీవ్యాప్తంగా పదో తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంలోనే విద్యాబోధన జరిగేలా చర్యలు తీసుకోవడం ఖాయమని కుండ బద్దలు కొట్టారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. జాతీయ స్థాయిలో ఏపీ విద్యార్థులు ధీటుగా కాంపిటిటివ్ పరీక్షలు సన్నద్దం కావాలంటే ఇంగ్లీష్ మీడియంలో బోధన తప్పనిసరి అని తేల్చి చెప్పారు. ఈ దిశగా ఏపీ విద్యార్థులను అన్ని అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవడంలో వెనక్కి తగ్గేది లేదని ఆయనన్నారు.

రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం వ్యతిరేకించేవారిపై ఘాటు విమర్శలు చేశారు జగన్‌. పిల్లలు జాతీయస్థాయిలో పోటీ పడాలని తాను ఇంగ్లీష్‌ మీడియం అమలు చేస్తానంటే వీరంతా విమర్శిస్తున్నారని కామెంట్‌ చేశారాయన. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న వెంకయ్యనాయుడు, చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ పిల్లలు ఎక్కడ చదువుతున్నారని సూటిగా ప్రశ్నించారు జగన్‌.

వచ్చే ఏడాది నుంచి నాలుగేళ్ళలో పదో తరగతి వరకు అన్ని స్కూళ్ళలో ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెడతామని ప్రకటించారు జగన్‌. తొలి ఏడాది ఆరో తరగతి వరకు.. తర్వాత నుంచి ఏటా ఒక తరగతి చొప్పున పెంచుతామని తెలిపారు. టెన్త్‌ క్లాస్‌లోను, ఆ తర్వాత జాతీయ స్థాయిలో పోటీ పడటానికి ఈ మార్పు ఉపయోగపడుతుందని వివరించారు ముఖ్యమంత్రి జగన్‌.

పాఠశాలల్లో చదివేవారికి అమ్మ ఒడితో పాటు…ఇంజినీరింగ్‌ వంటి వృత్తి విద్యలు చదువుకునేవారికి పూర్తి స్థాయిలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చేయనున్నట్లు ప్రకటించారు జగన్‌. అలాగే వృత్తి కాలేజీల్లో చదివేవారి మెస్‌ ఛార్జీల కింద వారి తల్లులకు ఏటా 20 వేల రూపాయలు చెల్లించనున్నట్లు తెలిపారాయన.

మదర్సాలు అంగీకరిస్తే ఇంగ్లీష్‌ మీడియంతో పాటు అమ్మ ఒడి పథకాన్ని వాటికి కూడా వర్తింపచేస్తామని చెప్పారు జగన్‌. మదర్సా బోర్డు కూడా త్వరలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఉర్దూ, ఖురాన్‌లను నేర్చుకోవడంతో పాటు ఇంగ్లీష్‌ మీడియంలో చదువుకుంటే పిల్లలకు ఎంతో ఉపయోగం ఉంటుందని చెప్పారు జగన్‌.