మహారాష్ట్రలో సీట్ల లొల్లి.. కొలిక్కి వచ్చినట్టేవచ్చి.. మళ్ళీ … !

మహారాష్ట్రలో సీట్ల లొల్లి కొలిక్కి వచ్చినట్టే వచ్చి … మళ్ళీ రగులుకుంది. అధికార పంపిణీ విషయంలో తలెత్తిన పేచీ.. బీజేపీ-శివసేన మధ్య తిరిగి ‘ రెండో అధ్యాయం ‘ లోకి చేరింది. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలంటూ రాష్ట్ర ఆర్ధిక మంత్రి, బీజేపీ నేత సుధీర్ ముంగంటి వార్ చేసిన వ్యాఖ్యపై శివసేన మండిపడింది. ఈ విధమైన కామెంట్ రాష్ట్రానికే కాదు.. రాష్ట్ర ప్రజలు ఇఛ్చిన తీర్పునకు కూడా అవమానకరం అని సేన తన ‘ సామ్నా […]

మహారాష్ట్రలో సీట్ల లొల్లి.. కొలిక్కి వచ్చినట్టేవచ్చి.. మళ్ళీ ... !
Anil kumar poka

| Edited By: Pardhasaradhi Peri

Nov 07, 2019 | 6:11 PM

మహారాష్ట్రలో సీట్ల లొల్లి కొలిక్కి వచ్చినట్టే వచ్చి … మళ్ళీ రగులుకుంది. అధికార పంపిణీ విషయంలో తలెత్తిన పేచీ.. బీజేపీ-శివసేన మధ్య తిరిగి ‘ రెండో అధ్యాయం ‘ లోకి చేరింది. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలంటూ రాష్ట్ర ఆర్ధిక మంత్రి, బీజేపీ నేత సుధీర్ ముంగంటి వార్ చేసిన వ్యాఖ్యపై శివసేన మండిపడింది. ఈ విధమైన కామెంట్ రాష్ట్రానికే కాదు.. రాష్ట్ర ప్రజలు ఇఛ్చిన తీర్పునకు కూడా అవమానకరం అని సేన తన ‘ సామ్నా ‘ పత్రికలో రాసిన ఎడిటోరియల్ లో పేర్కొంది. నవంబరు 7 కల్లా కొత్త ప్రభుత్వం ఏర్పడకపోయిన పక్షంలో ఇక ఇక్కడ రాష్ట్రపతి పాలనే దిక్కని సుధీర్ వ్యాఖ్యానించారు. 50 : 50 షేరింగ్ అంటూ శివసేన చేస్తున్న డిమాండే నూతన ప్రభుత్వ ఏర్పాటుకు అడ్డంకిగా మారిందని ఆయన అంటున్నారు. దీనిపై సేన.. ‘ రాష్ట్రపతి మీ కంట్రోల్ లో ఉన్నారా ? లేక మీ పార్టీ కార్యాలయంలో రాష్ట్రపతి ముద్ర ఏదైనా ఉందా ? మీరు ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోతే.. ఆ ముద్రను వినియోగించుకుని ప్రెసిడెంట్ రూల్ పెడతారా ‘ ? అని సేన ప్రశ్నించింది. ప్రస్తుత అసెంబ్లీ కాల పరిమితి ఈ నెల 8 తో ముగియబోతోంది. ఆ లోగా నూతన ప్రభుత్వం ఏర్పడాలి.. లేదా రాష్ట్రపతి జోక్యం చేసుకుంటారు అని సుధీర్ చేసిన కామెంట్లపై స్పందించిన సేన.. ఈ బెదిరింపులు రాజ్యాంగ విరుధ్ధమని, అయినా ఇలాంటి వాటికి తాము బెదరబోమని సవాల్ విసిరింది.’ రాష్ట్రపతి అంటే రాజ్యాంగాధిపతి.. అంతే తప్ప ఒక వ్యక్తి కాదు.. మొత్తం దేశానికే ప్రతినిధి ‘ అని ‘ సామ్నా పత్రికలో సేన నేతలు.. బీజేపీని దుయ్యబడుతూ పలు వ్యాఖ్యలు చేశారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu