Preity Zinta: నా కుటుంబం సేఫ్.. కరోనాను తేలికగా తీసుకోవద్దు.. రాత్రికి రాత్రి ఏదైనా జరగొచ్చు.
Preity Zinta Instapost: కరోనా మహమ్మారి ఇంకా తన ప్రతాపాన్ని చూపిస్తూనే ఉంది. ఓవైపు వ్యాక్సిన్ వస్తోందని సంతోషించాలా.. ఇప్పటికీ కేసులు నమోదవుతున్నాయని..

Preity Zinta Instapost: కరోనా మహమ్మారి ఇంకా తన ప్రతాపాన్ని చూపిస్తూనే ఉంది. ఓవైపు వ్యాక్సిన్ వస్తోందని సంతోషించాలా.. ఇప్పటికీ కేసులు నమోదవుతున్నాయని బాధపడాలా అర్థం కానీ పరిస్థితుల్లో ఉన్నాం. కరోనా తమ వరకు రాని వారు చాలా ధీమగా, వైరస్ పట్ల నిర్లక్ష్యంగా ఉంటున్నారు. అయితే ఈ మహమ్మారి ద్వారా నష్టపోయిన వారిని ప్రశ్నిస్తే మాత్రం దాని ప్రతాపం ఏంటో వెల్లడిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఓ ఎమోషనల్ పోస్ట్ చేసింది బాలీవుడ్ నటి ప్రీతి జింటా.
ఇటీవల ప్రీతి జింట కుటుంబసభ్యులు కరోనా బారిన పడ్డారు, కొన్ని వారాల పాటు కరోనాతో పోరాటం చేసిన వారు తాజాగా కొవిడ్‌ను జయించారు. ఈ నేపథ్యంలో ఇన్‌స్టాగ్రామ్ వేదికగా కుటుంబసభ్యులతో దిగిన ఫొటోను పోస్ట్ చేసిన ప్రీతి.. ‘మా అమ్మ, తమ్ముడు అతని భార్య, పిల్లలు, అంకుల్ ఇటీవల కరోనా బారిన పడ్డారు. దాదాపు మూడు వారాల తర్వాత వారంతా కరోనా నుంచి బయటపడ్డారు. అయితే కరోనాతో వారు వెంటిలేటర్‌పై చికిత్స పొందుతోన్న సమయంలో నేను వారితో లేనందుకు ఎంతో బాధగా ఉంది. తాజాగా వారంతా సేఫ్‌గా బయటపడ్డందుకు వారికి చికిత్స చేసిన డాక్టర్లకు, నర్సులకు అందరికీ నా ధన్యవాదాలు. ఎవరూ కరోనాను తేలికగా తీసుకోవద్దు, కరోనాతో రాత్రికి రాత్రి ఏదైనా జరగొచ్చు. అందరూ జాగ్రత్తలు పాటించండి, మాస్క్‌లు వాడుతూ.. భౌతిక దూరాన్ని పాంటించండి’ అంటూ పోస్ట్ చేసిందీ బ్యూటీ.
తన కుటుంబసభ్యులు కరోనాను జయించారని తెలుపుతూ ప్రీతి చేసిన పోస్ట్..
View this post on Instagram
Also Read: ఒడిశాలో పాఠశాలల్లో కరోనా కలవరం.. 31 మంది ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులకు పాజిటివ్




